జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 22న ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత అభ్యర్థుల ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 22న ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది.ఢిల్లీ పర్యటన తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంది. ఈ రెండు పార్టీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్టుగా ప్రకటించాయి. ఈ కూటమిలో బీజేపీ కూడ చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల న్యూఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డాతో చర్చించారు.
undefined
also read:బంతి స్పీకర్ కోర్టులోకి: తుది విచారణకు టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ రెబెల్ ఎమ్మెల్యేల గైర్హాజర్
పొత్తుల కారణంగా సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా మారిందని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు ఇటీవల టెలికాన్ఫరెన్స్ లో చెప్పారు. మరో వైపు ఇతర పార్టీల నుండి చేరికల కారణంగా సీట్లను కూడ వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొందని చంద్రబాబు పార్టీ నేతలకు తేల్చి చెప్పారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు న్యూఢిల్లీలో ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పురంధేశ్వరి సహా నేతలు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఇతర పార్టీలతో పొత్తుల విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయం తీసుకుంటుందని గతంలోనే పలుమార్లు పురంధేశ్వరి ప్రకటించారు.
అయితే ఈ నెల 22న పవన్ కళ్యాణ్ న్యూఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.
also read:గ్రూప్-1 నోటిఫికేషన్: రద్దు చేసిన టీఎస్‌పీఎస్‌సీ
సంక్రాంతి తర్వాతే తెలుగు దేశం, జనసేన అభ్యర్థుల జాబితా విడుదల కావాల్సి ఉంది. అయితే బీజేపీ ఈ కూటమిలో చేరే విషయమై ఇంకా అధికారికంగా స్పష్టత రాని కారణంగానే ఈ కూటమి అభ్యర్థుల జాబితా ఇంకా విడుదల కాలేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత ఈ విషయమై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉండొచ్చనే చర్చ కూడ ప్రారంభమైంది.
also read:ఆంధ్రప్రదేశ్‌లో రేవంత్ ప్రచారం: తిరుపతి సభకు తెలంగాణ సీఎం
జిల్లాల వారీగా పవన్ కళ్యాణ్ పర్యటనలు ప్రారంభించనున్నారు. ఇవాళ విశాఖ జిల్లాలో పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించారు. విశాఖపట్టణం జిల్లా పర్యటనను ముగించుకుని పవన్ కళ్యాణ్ రాజమండ్రికి చేరుకున్నారు.