బంతి స్పీకర్ కోర్టులోకి: తుది విచారణకు టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ రెబెల్ ఎమ్మెల్యేల గైర్హాజర్

By narsimha lode  |  First Published Feb 19, 2024, 5:30 PM IST


టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ వద్ద జరిగే విచారణకు గైర్హాజరయ్యారు.
 


అమరావతి: తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణకు  ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు రాలేదు. ఈ విషయమై  న్యాయ సలహా తీసుకున్న తర్వాత  స్పీకర్  నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.  

తెలుగు దేశం, వైఎస్ఆర్‌సీపీ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై  స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం నాడు విచారణ చేయాల్సి ఉంది. ఈ విషయమై  ఈ రెండు పార్టీలకు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను విచారణకు రావాలని  స్పీకర్ తమ్మినేని సీతారాం  నోటీసులు పంపారు. సోమవారం నాడు మధ్యాహ్నం తొలుత తెలుగు దేశం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం విచారించాల్సి ఉంది. 

Latest Videos

undefined

also read:గ్రూప్-1 నోటిఫికేషన్: రద్దు చేసిన టీఎస్‌పీఎస్‌సీ

2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నుండి విజయం సాధించిన కరణం బలరాం,  వల్లభనేని వంశీ,  మద్దాలి గిరి,  వాసుపల్లి గణేష్ లు  వైఎస్ఆర్‌సీపీకి మద్దతు పలికారు. దీంతో  వీరిపై అనర్హత వేటేయాలని తెలుగు దేశం పార్టీ  స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. మరో వైపు  గత ఎన్నికల్లో  వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధులుగా విజయం సాధించిన ఆనం రామనారాయణరెడ్డి,  ఉండవల్లి శ్రీదేవి,  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపై  వైఎస్ఆర్‌సీపీ  ఫిర్యాదు చేసింది. 2023లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నలుగురు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు  తెలుగు దేశం పార్టీకి ఓటేశారని  ఆ పార్టీ ఈ నలుగురిపై చర్యలు తీసుకొంది.వీరిపై అనర్హత వేటేయాలని  స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. 

also read:ఢిల్లీకి రేవంత్ రెడ్డి: కేబినెట్ విస్తరణ, నామినేటేడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చలు

ఈ ఫిర్యాదుపై  రెండు పార్టీలకు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను తుది విచారణకు రావాలని స్పీకర్  నోటీసులు పంపారు. ఇవాళ చివరి విచారణకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. విచారణకు  ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గైర్హాజర్ కావడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.

ఇదిలా ఉంటే తెలుగు దేశం రెబెల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని  ఆ పార్టీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయులు స్పీకర్ తమ్మినేని సీతారాం ను కలిశారు.  తాము ఫిర్యాదు చేసిన నలుగురు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని  ఆయన కోరారు.

also read:ఆంధ్రప్రదేశ్‌లో రేవంత్ ప్రచారం: తిరుపతి సభకు తెలంగాణ సీఎం

కొందరు ఎమ్మెల్యేలు  ఇవాళ విచారణకు రాలేమని  స్పీకర్ కార్యాలయానికి సమాచారం పంపినట్టుగా  ప్రచారం సాగుతుంది.  అయితే  ఈ విషయమై  న్యాయ సలహా తీసుకొన్న తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం  తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేకపోలేదు.


 

click me!