రేపు పెడన సభలో రాళ్లదాడికి వైసీపీ కుట్ర: పవన్ కళ్యాణ్ సంచలనం

By narsimha lode  |  First Published Oct 3, 2023, 2:50 PM IST

పెడనలో రేపు  తమ పార్టీ సభపై రాళ్లదాడికి వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ చేసిందని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు.  


విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెడనలో  రేపు తమ పార్టీ నిర్వహించే సభను అడ్డుకొనేందుకు  వైసీపీ  ప్రయత్నిస్తుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు.మంగళవారంనాడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిర్వహించిన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.పెడన సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు.  పెడన సభను  అడ్డుకునేందుకు క్రిమినల్స్ ను దింపారనే సమాచారం తమకు ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. 

పబ్లిక్ మీటింగ్ లో రాళ్ళ దాడి చేసి గొడవ చేయాలని ప్లాన్ చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పెడన సభలో గొడవలు సృష్టిస్తే తాము సహించబోమన్నారు.తమ సభలో గొడవ జరిగితే  ఆ తర్వాత జరిగే పరిణామాలకు  సీఎం, డీజీపీ బాధ్యత వహించాలని ఆయన చెప్పారు.

Latest Videos

undefined

టీడీపీ, జనసేన పొత్తును విచ్ఛిన్నం చేయాలని కుట్ర చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జిల్లా ఎస్పీలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరారు. మీరు పులివెందుల రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోమని పవన్ కళ్యాణ్ సీఎం జగన్ కు వార్నింగ్ ఇచ్చారు. పెడనలో దాడులు చేస్తే  ఎదురు దాడి చేయవద్దని ఆయన జనసేన సైనికులను పవన్ కళ్యాణ్ కోరారు. 

ఎవరు అనుమానంగా ఉన్నా జేబుల్లో నుంచి ఆయుధాలు తీసినా వారిని పట్టుకోవాలని ఆయన సూచించారు.రెండు, మూడు వేల మంది రౌడీ మూకలు వచ్చే అవకాశం ఉందన్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్ లో చాలా దారుణంగా ఉంటుందని పవన్ కళ్యాణ్  హెచ్చరించారు.

ఈ నెల 1వ తేదీ నుండి ఉమ్మడి కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ వారాహి నాలుగో విడత యాత్రను ప్రారంభించారు.  ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని పలు నియోజకవర్గాల గుండా యాత్ర సాగుతుంది. మరో వైపు  జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో  ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు.ఈ మేరకు జనవాణిని నిర్వహిస్తున్నారు. వారాహి యాత్రకు టీడీపీ కూడ మద్దతు ప్రకటించింది.  ఈ నెల 1న వారాహి యాత్ర ప్రారంభాన్ని పురస్కరించుకుని  వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ,జనసేన సర్కార్ ఏర్పాటు ఆవశ్యకతను ఆయన వివరించారు. 

also read:టీడీపీ,జనసేన కలిసినా అమీతుమీ పోటీ: పవన్ కళ్యాణ్

గత మాసంలో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో పవన్ కళ్యాణ్ పరామర్శించారు.  ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో టీడీపీ,జనసేన మధ్య పొత్తు ఉంటుందని  పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తును ప్రకటించిన తర్వాత  నాలుగొో విడత వారాహి యాత్రను పవన్ కళ్యాణ్ చేపట్టారు. 

 

click me!