వైసీపీ నేతలకు భయం అంటే ఏంటో నేర్పిస్తా: పంచ్‌లతో వైసీపీ నేతలకు పవన్ కౌంటర్

Published : Sep 29, 2021, 04:25 PM IST
వైసీపీ నేతలకు భయం అంటే ఏంటో నేర్పిస్తా: పంచ్‌లతో వైసీపీ నేతలకు పవన్ కౌంటర్

సారాంశం

వైసీపీ నేతలు గత కొన్ని రోజులుగా తనపై చేస్తున్న విమర్శలకు జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  కౌంటర్ ఇచ్చారు. పంచ్ డైలాగ్‌లతో వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. గ్రామ సింహాలంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. మంగళగిరిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు.

అమరావతి: వైసీపీ నేతలకు భయం అంటే నేర్పిస్తానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.బుధవారం నాడు జనసేన (jana sena) చీఫ్ పవన్ కళ్యాణ్  (pawan kalyan ) మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

also read:పనికిమాలిన వారిని రెచ్చగొట్టి దాడి, చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలి:జగన్‌పై నాదెండ్ల మనోహర్ ఫైర్

వైసీపీ గ్రామ సింహాలు అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గోంకారం అంటే మొరుగుట అని డిక్షనరీలో అర్ధం ఉందన్నారు.గ్రామ సింహం అంటే కుక్కలు, వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు అని పలు డిక్షనరీల్లో అర్ధాలున్నాయని ఆయన వివరించారు. 

అనాల్సిన మాటలన్నీ అని ఆ తర్వాత కులాల చాటున దాక్కొంటే లాక్కొచ్చి కొడతానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. బాపట్లలోనే పుట్టినవాడిని నాకు బూతులు  రావా అని ఆయన ప్రశ్నించారు.  ఒక్క రోజు సమయమిస్తే నాలుగు భాషల్లో తిడతానని ఆయన చెప్పారు.  

రాజకీయాల్లో ఉన్నందున తాను బూతులు మాట్లాడడం లేదన్నారు. వైసీపీకి చెందిన కిందిస్థాయి కార్యకర్త నుండి ఆ పార్టీ చీఫ్ కుటుంబానికి చెందిన మహిళలను తమ పార్టీకి చెందిన నేతలు కానీ తాను కానీ అసభ్యంగా మాట్లాడబోమని ఆయన స్పష్టం చేశారు.నా జీవితం బ్లాక్ అండ్ వైట్ అన్నారు. కానీ మీ జీవితం రంగులమయమని పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై మండిపడ్డారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు