ఒక్క ఎమ్మెల్యే...: రాపాక వరప్రసాద్ పై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

By telugu teamFirst Published Mar 14, 2020, 2:09 PM IST
Highlights

తమ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన నిర్ణయాలను రాపాక వరప్రసాద్ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.

రాజమండ్రి: తమ పార్టీ శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని, ఓటేసినా వేయకున్నా ప్రజల వెంట ఉంటామని చెబుతూ తమ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నారని చెప్పి ఆ తర్వాత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

పార్టీలో ఉన్నారా లేదా అనేది ఆయన మనస్సాక్షికి తెలియాలని, దాన్ని ఆయనకే వదిలేస్తానని ఆయన అన్నారు. మనకు ఒక్క ఎమ్మెల్యే ఉన్నారని చెప్పి వెంటనే ఆయన వ్యాఖ్యలు చేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం రాజమండ్రిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 

Also Read: పవన్ కళ్యాణ్‌పై తిరుగుబాటు: అసెంబ్లీలో మూడు రాజదానులకు జై కొట్టిన రాపాక

శాసనసభ ఎన్నికల్లో జనసేన నుంచి రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలిచారు. అయితే, ఆయన పవన్ కల్యాణ్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను పవన్ కల్యాణ్ వ్యతిరేకించగా, రాపాక సమర్థించారు. పార్టీ కార్యకలాపాలకు కూడా రాపాక దాదాపుగా దూరంగా ఉంటున్నారు.

మూడు రాజధానుల ప్రతిపాదనను సమర్థిస్తూ రాపాక వరప్రసాద్ శాసనసభలో కూడా మాట్లాడారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పాలన వికేంద్రీకరణ బిల్లును తేవడాన్ని తాను సమర్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇటువంటి స్థితిలో రాపాక వరప్రసాద్ పై పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలు చేశారు. 

Also read: ఆ రెండు బిల్లులకు వ్యతిరేకించాలి: రాపాక వరప్రసాద్‌కు పవన్ లేఖ

click me!