జ్వర పీడితులను పరామర్శించిన జగన్

First Published Jul 1, 2017, 6:52 PM IST
Highlights

108 అంబులెన్సులకు డీజల్ కూడా పోయించలేని దుస్ధితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే దారుణాలు జరుగుతున్నాయని, కాబట్టి చంద్రబాబునాయుడే సమాధానం చెప్పాలని జగన్ డిమాండ్ చేసారు.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జ్వరబాధితులను పరామర్శించారు. శనివారం తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జ్వరపీడితులను పరామర్శించారు. బాధితులు నీరసంగా ఉండటాన్ని చూసి చలించిపోయారు. రక్తహీనతతో బాధపడుతున్న బాధితులను వారికి మెరుగైన చికిత్స చేయాలంటూ వైద్యులను కోరారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఇప్పటి వరకూ వైద్య పోస్టుల భర్తీకి ఎందుకు నోటిఫికేషన్ ప్రకటించలేదని మండిపడ్డారు. ఏజెన్సీలో ఎన్నిసార్లు పర్యటించినా మార్పు కనబడటం లేదని ధ్వజమెత్తారు. కనీస వసతి సదుపాయాలు కూడా లేకపోవటంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. 108 అంబులెన్సులకు డీజల్ కూడా పోయించలేని దుస్ధితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే దారుణాలు జరుగుతున్నాయని, కాబట్టి చంద్రబాబునాయుడే సమాధానం చెప్పాలని జగన్ డిమాండ్ చేసారు.

click me!