నంద్యాలలో జగన్ ఇంటింటికి ప్రచారం

Published : Jul 21, 2017, 12:32 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
నంద్యాలలో జగన్ ఇంటింటికి ప్రచారం

సారాంశం

నోటిఫికేషన్ వచ్చేస్తే భారీ ప్రచారం సాధ్యం కాదుకాబట్టి ఈలొగానే నియోజకవర్గాన్ని పూర్తిగా చుట్టి రావలన్నది జగన్ ఉద్దేశ్యంగా కనబడుతోంది. అందులో భాగంగానే నంద్యాల నియోజకవర్గంలో కీలకమైన నంద్యాల మున్సిపాలిటీతో ప్రచారాన్ని ఆరంబిస్తున్నారు. ప్రచారంలో ఇంటింటికి వెళ్ళి అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డికి ఓటు వేయాలని కోరనున్నారు.  ఫిరాయింపు మంత్రులకు కోర్టు కూడా నోటీసులు జారీ చేయటమన్నది టిడిపికి బాగా ఇబ్బందవుతోంది.

నంద్యాల ఉపఎన్నికపై జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. నోటిఫికేషన్ వచ్చేలోగానే నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు పార్టీవర్గాల సమాచారం. ఈనెలాఖరుకు నోటిఫికేషన్ రావచ్చని అనుకుంటున్నారు. నోటిఫికేషన్ వచ్చేస్తే భారీ ప్రచారం సాధ్యం కాదుకాబట్టి ఈలొగానే నియోజకవర్గాన్ని పూర్తిగా చుట్టి రావలన్నది జగన్ ఉద్దేశ్యంగా కనబడుతోంది.

అందులో భాగంగానే నంద్యాల నియోజకవర్గంలో కీలకమైన నంద్యాల మున్సిపాలిటీతో ప్రచారాన్ని ఆరంబిస్తున్నారు. ప్రచారంలో ఇంటింటికి వెళ్ళి అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డికి ఓటు వేయాలని కోరనున్నారు. సరే, చంద్రబాబునాయుడు పాలనపైనా, అధికారపార్టీ నేతల అరాచకాలపైన కూడా విరుచుకుపడతారనుకోండి అది వేరే చెప్పక్కర్లేదు.

ఇప్పటి గ్రౌండ్ రిపోర్టును బట్టి పరిస్ధితులు వైసీపీకే అనుకూలంగా ఉన్నాయని అనిపిస్తోంది. ఎందుకంటే, శిల్పా ఎక్కడ ప్రచారం చేసినా పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతున్నారు జనాలు. దశాబ్దాల పాటు నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉన్న కారణంగా  శిల్పాకు ప్రతీ గ్రామంలోనూ మద్దతుదారులున్నారు. పైగా మంత్రిగా ఎంఎల్ఏగా పనిచేసినపుడు అంతో ఇంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉండటం కూడా ఇపుడు కలసివస్తోంది.

చూడబోతే ఫిరాయింపు రాజకీయాలను నంద్యాల జనాలు పెద్దగా ఆధరిస్తున్నట్లు కనబడటంలేదు. ఎందుకంటే, టిడిపి అభ్యర్ధి భూమాబ్రహ్మానందరెడ్డి ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా జనాలు పెద్దగా ఆశక్తి చూపటం లేదు. నంద్యాలలో వైసీపీ తరపున గెలిచిన భూమా నాగిరెడ్డి తర్వాత టిడిపిలోకి ఫిరాయించటాన్ని జనాలు అంగీకరించలేదు. దాంతో ఫిరాయింపులన్నది టిడిపికి పెద్ద సమస్యగా మారింది.

జగన్ కూడా ఇప్పటికే పలుమార్లు ఫిరాయింపుల చేత రాజీనామాలు చేయించి ఉపఎన్నికలు జరిపించమని చంద్రబాబుకు ఎన్నోమార్లు సవాలు విసిరిన సంగతి తెలిసిందే కదా? తాజాగా జనాల మూడ్ కూడా అదేవిధంగా ఉండటంతో వైసీపీ నేతల్లో ఉత్సాహం కనబడుతోంది. అదే విషయాన్ని జగన్ తన ప్రచారంలో ప్రస్తావించనున్నారు. దానికితోడు నలుగురు ఫిరాయింపు మంత్రులకు కోర్టు కూడా నోటీసులు జారీ చేయటమన్నది టిడిపికి బాగా ఇబ్బందవుతోంది.

ఫిరాయింపులపై తన డిమాండును, చంద్రబాబు వైఖరిని, కోర్టునోటీసులను ప్రధానంగా ప్రస్తావించనున్నారు. సరే, భూమా జీవించి ఉన్నంత కాలం నియోజకవర్గాన్ని చంద్రబాబు ఏ విధంగానూ పట్టించుకోని విషయం ఇప్పటికే జనాల నోళ్ళల్లో నానుతోందనుకోండి. మొత్తం మీద జగన్ తన ప్రచారం ద్వారా శిల్పాకు మంచి ఊపు తేనున్నారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయ్.

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: చంద్రబాబు, పవన్ పై అంబటి సెటైర్లు | Asianet News Telugu
Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu