పంతం నెగ్గించుకున్నజగన్

First Published Jan 26, 2017, 11:13 AM IST
Highlights

విమానాశ్రయం రన్ వేపై నుండి లేచి బయటకు రావాల్సిందిగా పోలీసులు జగన్, తదితరులను బ్రతిమలుడుతున్నా, జగన్ పట్టించుకోలేదు. దాంతో వైజాగ్ మొత్తం టెన్షన్ మొదలైంది.

‘ఆడు మగాడ్రా బుజ్జి’ అని ఓ సినిమాలో డైలాగ్ ఉంది. జగన్ వ్యవహారం చూస్తుంటే ఇపుడు అందరూ ఆ డైలాగ్ నే గుర్తుచేసుకుంటున్నారు. ఎందుకంటే,  ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ అన్నంత పనీ చేసాడు. ప్రభుత్వానికి సవాలు విసిరినట్లే జగన్ విశాఖపట్నం వెళ్ళారు. ప్రత్యేకహోదా కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనేందుకు తాను విశాఖపట్నం వెళతానని నిన్ననే చెప్పారు. ఏం చేస్తారో చేసుకోమంటూ ఛాలెంజ్ విసిరారు. అన్నట్లుగానే తన పంతాన్ని నెగ్గించుకున్నారు.

 

ప్రత్యేకహోదా కోరుతూ రాష్ట్రంలోని యువత విశాఖప్నటం లోని ఆర్కె బీచ్ వద్ద కొవ్వుత్తుల ఉద్యమం చేయాలంటూ హటాత్తుగా ఓ ఉద్యమం మొదలైంది. దానికి ప్రతిపక్షాలంతా వత్తాసు పలకటంతో ఒక్కసారిగా ఊపొచ్చింది. దాంతో ప్రభుత్వంలో ఉలిక్కిపాటు మొదలైంది. ప్రభుత్వం ఎక్కడికక్కడ 144 సెక్షన్ అమలు చేసింది. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలైన విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, కాకినాడ తదితర పట్టణాల్లో ఉదయం నుండి యువత గుమిగూడారు. దాంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు.

 

 నేపధ్యంలో జగన్ ఆలోచన ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. విశాఖపట్నం నగరంలోకి వెళ్ళే అన్నీ దారులను పోలీసులు మూసేసారు. అయితే,మధ్యహ్నంపైన జగన్ విశాఖపట్నం ఎయిర్ పోర్టులో అడుగుపెట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. దాంతో పోలీసుల పన్నాగాన్ని కనిపెట్టిన జగన్ బయటకు రాకుండా రన్ వే పైనే కూర్చున్నారు. కొవ్వుత్తుల నిరసనలో పాల్గొనేందకు అనుమతి ఇవ్వాలంటూ రన్వే పైనే కూర్చకోవటం నిజంగా సంచలనమే. ఎందుకంటే, గతంలో ఏ నేత కూడా విమానాశ్రమం రన్ వే పై కూర్చుని నిరసన తెలపటం వినలేదు, చూడలేదు. దాంతో పోలీసులకు ఏం చేయాలో దిక్కు తెలీటంలేదు. విమానాశ్రయం రన్ వేపై నుండి లేచి బయటకు రావాల్సిందిగా పోలీసులు జగన్, తదితరులను బ్రతిమలుడుతున్నా, జగన్ పట్టించుకోలేదు. దాంతో వైజాగ్ మొత్తం టెన్షన్ మొదలైంది. జగన్ అరెస్టయ్యారనే ప్రచారంతో విమానాశ్రయం బయటంతా వైసీపీ కార్యకర్తలు, యువత చుట్టుముట్టారు.

click me!