చంద్రబాబుపై దూకుడు పెంచండి: మంత్రులకు జగన్ ఆదేశం

By narsimha lodeFirst Published Jul 16, 2019, 11:02 AM IST
Highlights

అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై మరింత దూకుడుగా వెళ్లాలని ఏపీ సీఎం వైఎస్ జగన్  ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరిస్తున్న  వ్యూహంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్  చర్చించారు.

అమరావతి: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై మరింత దూకుడుగా వెళ్లాలని ఏపీ సీఎం వైఎస్ జగన్  ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరిస్తున్న  వ్యూహంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్  చర్చించారు.

అసెంబ్లీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంటుంది.  గత ప్రభుత్వంలో టీడీపీ సర్కార్ అవలంభించిన విధానాలపై వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది. రెండు పార్టీల మధ్య గొడవల కొన్ని సమయాల్లో రెండు పార్టీ నేతలు  వ్యక్తిగత దుషణలకు కూడ దిగుతున్నారు.

అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై స్ట్రాటజీ కమిటీ సభ్యులతో సీఎం జగన్ చర్చించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా చంద్రబాబును ఇరుకున  పెడుతున్నట్టుగా  ఈ సందర్భంగా జగన్  స్ట్రాటజీ సభ్యులకు చెప్పారని సమాచారం.

విపక్షం వ్యూహాత్మకంగా ప్రశ్నలు వేస్తోందని  జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వ్యవహరించాలని  జగన్ మంత్రులకు పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు.  అసెంబ్లీలో బడ్జెట్‌పై ధర్మాన ప్రసాదరావు, కాకని గోవర్ధన్ రెడ్డి  బాగా మాట్లాడారని జగన్ అభినందించారు. 

అతి జాగ్రత్తగా సభ్యులు మాట్లాడాలని జగన్ సూచించారు.  ప్రతి అంశానికి సంబంధించి కచ్చితమైన సమాచారం ఆధారంగా సభలో మాట్లాడాలని ఆయన పార్టీ ప్రజా ప్రతినిధులకు చెప్పారు. రాజకీయంగా ప్రతిపక్షంపై పైచేయి సాధించేలా  అసెంబ్లీలో ప్రశ్నలు ఉండాలని జగన్ కోరారు.  

సమావేశాలు ప్రారంభం కావడానికి అరగంట ముందుగానే మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకావాలని జగన్ సూచించారు. స్పీకర్ అసెంబ్లీకి హాజరైన సమయంలో ఆయనకు స్వాగతం పలకడంతో పాటు వాయిదా తీర్మాణాలపై చీప్ విప్, విప్ మంత్రులు సమీక్షించాలని ఈ సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.  

click me!