రోజాకి ఆ అవకాశం కూడా ఇవ్వలేదు.. చెవిరెడ్డి కామెంట్స్

Published : Jul 16, 2019, 10:35 AM IST
రోజాకి ఆ అవకాశం కూడా ఇవ్వలేదు.. చెవిరెడ్డి కామెంట్స్

సారాంశం

ఏపీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా... అధికార, విపక్ష పార్టీలు ఒకరినొకరు ధూషించుకుంటున్నారు.

ఏపీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా... అధికార, విపక్ష పార్టీలు ఒకరినొకరు ధూషించుకుంటున్నారు.  కాగా... టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నగరి ఎమ్మెల్యే రోజాపై గతంలో అసెంబ్లీలోకి రాకుండా ఏడాది పాటు సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయాన్ని తాజాగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. టీడీపీపై విమర్శలు గుప్పించారు.

ఉరి శిక్ష వేసిన ఖైదీని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని, రోజాకు ఆ అవకాశం కూడా కల్పించలేదని చెవిరెడ్డి విమర్శించారు. రోజాకు తన వాదన వినిపించేందుకు అవకాశం కల్పించకుండా మార్షల్స్‌తో బయటకు పంపించిన టీడీపీ సభా సాంప్రదాయాలను గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చెవిరెడ్డి దుయ్యబట్టారు.

అధికార వైసీపీ నేతలు సభా మర్యాదలు పాటించడం లేదని టీడీపీ నేతలు ఆరోపించడంతో... చెవిరెడ్డి రోజా సస్పెన్షన్ విషయాన్ని ప్రస్తావనకు తీసుకురావడం గమనార్హం. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్