జగన్ వల్లే బిసి-కాపుల మధ్య చిచ్చు

Published : Jun 01, 2017, 01:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
జగన్ వల్లే బిసి-కాపుల మధ్య చిచ్చు

సారాంశం

అన్నదామ్ములాగున్న కాపు-బిసిల మధ్య చిచ్చుపెట్టింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే అన్నారు. కాపుల వద్దకు వెళ్ళి బిసిలకు వ్యతిరేకంగాను, బిసిల వద్దకు వెళ్లి కాపులకు వ్యతిరేకంగాను మాట్లాడటం వల్లే కాపులు-బిసిలు ఎదురుపడినా మాట్లాడే పరిస్ధితి లేకుండా పోయిందట.

చంద్రబాబునాయుడు కన్నా ఆయన స్కూల్లో చదువుకున్న నేతలు నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్లున్నారు. విజయవాడలో బుధవారం ఓ కార్యక్రమం జరిగింది. దానికి కాపు కార్పోరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ్య హాజరయ్యారు. ఆ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ, అన్నదామ్ములాగున్న కాపు-బిసిల మధ్య చిచ్చుపెట్టింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డేనట. కాపుల వద్దకు వెళ్ళి బిసిలకు వ్యతిరేకంగాను, బిసిల వద్దకు వెళ్లి కాపులకు వ్యతిరేకంగాను మాట్లాడటం వల్లే కాపులు-బిసిలు ఎదురుపడినా మాట్లాడే పరిస్ధితి లేకుండా పోయిందట.

మంత్రిగా, ఎంపిగా ఉన్నపుడు కాపులకు ఏమీ చేయని, అసలు కాపులను తన వద్దకు రానేవద్దని బోర్డే పెట్టుకున్న  పెద్దమనిషికి మద్దతు ఇవ్వటం ద్వారా జగన్ కాపు-బిసిలను విడగొడుతున్నట్లు ఛైర్మన్ వ్యాఖ్యలు చేయటం విడ్డూరంగా ఉంది. చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని చక్కగా పాలిస్తుంటే కులాల మధ్య చిచ్చుపెడుతున్నది జగనేనన్నారు.

చంద్రబాబేమో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావటానికి కష్టపడుతున్నారట. కానీ జగన్ వైఖరి వల్లే రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని పెట్టుబడి, పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారట. చంద్రబాబుపై జగన్ బురదచల్లటం తప్ప ఇంకేమీ చేయలేరన్నారు. జగన్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని కాపు సామాజికవర్గం తిప్పికొట్టాలన్నారు. సమాజాన్ని పదేళ్ళ పాటు జగన్ దోచుకుతిన్నారట.

దోచుకున్న డబ్బుతోనే మీడియా పెట్టుకున్నారట. ఎవరైనా అడిగినా కాపులెవరూ పేపర్, ఛానల్ చూడవద్దని చెప్పారు. జగన్ పెద్ద అహంకారిగా ఓ రిటైర్డ్ ఐఏఎస్ అదికారి తనకు చెప్పినట్లు ఛైర్మన్ తెలిపారు. జగన్ సిఎం అయ్యుంటే రాష్ట్రంలో మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు తప్ప ఇంకేమీ జరగవన్నారు. కాబట్టే భగవంతుడు జగన్ సిఎం కాకుండా అడ్డుకున్నట్లు తెలిపారు.

పోయిన ఎన్నకల్లో కాపులను బిసిల్లోకి చేరుస్తానని చెప్పిందెవరో రామానుజయ్య మరచిపోయినట్లున్నారు. అధికారంలోకి రాగానే తానిచ్చిన హామీని మరచిపోతేనే కాపులు గుర్తు గొడవ మొదలుపెట్టినట్లు బహుశా ఛైర్మన్ కు గుర్తులేదేమో. బాగా గొడవ జరిగిన తర్వాత మంజూనాధ కమీషన్ విసిందెవరో ఛైర్మన్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది. చూసారా చంద్రబాబు కంటే వాళ్ళ బడిలో చదువుకున్న వారు ఎలా మాట్లాడుతున్నారో?

PREV
click me!

Recommended Stories

RK Roja Celebrate Kanuma GoPuja: కనుమ సందర్బంగాగోపూజ నిర్వహించిన ఆర్కె రోజా| Asianet News Telugu
Kethireddy Pedda Reddy Pressmeet: ఎక్క‌డైనా చర్చకు సిద్ధం జేసీకి పెద్దారెడ్డి స‌వాల్| Asianet Telugu