జగన్ కు కోర్టులో ఊరట

Published : Apr 28, 2017, 07:29 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
జగన్ కు కోర్టులో ఊరట

సారాంశం

సిబిఐ వాదనలో పస లేదని పేర్కొంటూ సిబిఐ కేసును కోర్టు కొట్టేసింది. దాంతో జగన్ కు పెద్ద ఊరట లభించినట్లే.

జగన్మోహన్ రెడ్డికి పెద్ద రిలీఫ్. జగన్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ వేసిన పిటీషన్ను కోర్టు కొట్టేసింది. అక్రమాస్తుల కేసులో జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారు కాబట్టి జగన్ బెయిల్ ను రద్దు చేయాలని సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా? దానిపై జగన్  వాదనలు కూడా విన్న కోర్టు ఈ రోజు తీర్పు చెప్పింది. సిబిఐ వాదనలో పస లేదని పేర్కొంటూ సిబిఐ కేసును కోర్టు కొట్టేసింది. దాంతో జగన్ కు పెద్ద ఊరట లభించినట్లే. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. ఈ తీర్పు కోసం ఉదయం నుండి ఇటు టిడిపి అటు వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు.

ఎప్పుడైతే సిబిఐ పిటీషన్ను కోర్టు కొట్టేసిందని తెలిసిందో టిడిపిలో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకూ బెయిల్ రద్దవుతుందని, జగన్ మళ్ళీ జైలుకు వెళ్ళక తప్పదని టిడిపి నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎలాగైనా సరే జగన్ బెయిల్ రద్దు కావాలని కూడా కోరుకున్నారు. అయితే అంతిమంగా కోర్టు జగన్ వాదననే సమర్ధించింది. తాను ఎవరినీ ప్రభావితం చేయలేదని జగన్ వాదించారు. సాక్షి టివిలో వచ్చిన రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూకి తనకు సంబంధమే లేదన్నారు. ఇతర ప్రముఖుల ఇంటర్వ్యూలను ప్రసారం చేసినట్లే రమాకంత్ రెడ్డిని కూడా టివి సిబ్బంది ఇంటర్వ్యూ చేసిందని జగన్ వాదించారు. కోర్టు జగన్ వాదనతో ఏకీభవించటంతో సిబిఐ పిటీషన్ను కొట్టేసింది.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే