అమరావతిపై కట్టుబడి ఉన్నా: చంద్రబాబుకు ఐవిఆర్ కౌంటర్

Published : Apr 28, 2018, 03:58 PM IST
అమరావతిపై కట్టుబడి ఉన్నా: చంద్రబాబుకు ఐవిఆర్ కౌంటర్

సారాంశం

పదవుల్లో ఉన్నప్పుడు అద్భుతంగా ఉందన్నవారు, పదవీ విరమణ చేసిన తర్వాత పుస్తకాలు రాస్తున్నారని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యను ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణా రావు తిప్పికొట్టారు. 

హైదరాబాద్: పదవుల్లో ఉన్నప్పుడు అద్భుతంగా ఉందన్నవారు, పదవీ విరమణ చేసిన తర్వాత పుస్తకాలు రాస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యను ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణా రావు తిప్పికొట్టారు. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై తాను రాసిన ఎవరి రాజధాని అమరావతి నే పుస్తకంలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నానని ఆయన శనివారం మీడియాతో అన్నారు. అంతేకాకుండా మరిన్ని వాస్తవాలను వెల్లడిస్తానని కూడా అన్ారు. 

ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. చంద్రబాబు కొద్ది రోజులుగా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. 

బిజెపి వల్ల లాభం కలిగిందని నాలుగేళ్ల పాటు చంద్రబాబు చెబుతూ వచ్చారని, ఇప్పుడు నష్టపోయామని అంటున్నారని ఆయన అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్