టీడీపీ నేతలపై ఐటీ గురి.. నెల్లూరులో బీద మస్తాన్ రావు ఇంటిలో సోదాలు

By sivanagaprasad kodatiFirst Published Oct 5, 2018, 8:27 AM IST
Highlights

రాజకీయ కారణాలతో టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను నిజం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని పలువురు తెలుగుదేశం నేతల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తోంది

రాజకీయ కారణాలతో టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను నిజం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని పలువురు తెలుగుదేశం నేతల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తోంది.

నెల్లూరు జిల్లా టీడీపీ నేత, కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ప్రముఖ పారిశ్రామిక వేత్త బీద మస్తాన్‌రావు ఫ్యాక్టరీలు, నివాసాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించారు. చెన్నైలోని మస్తాన్‌రావు నివాసం, కార్పోరేట్ కార్యాలయం, నెల్లూరులోని కార్యాలయం, కావలి సమీపంలోని విమానాశ్రయ భూముల వద్ద రోయ్యల మేత ఫ్యాక్టరీ, రొయ్యలను విదేశాలకు ఎగుమతి చేసే ప్రాసెసింగ్ యూనిట్‌పై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

‘‘బీఎంఆర్’’ గ్రూపుతో మస్తాన్‌రావు వ్యాపారాలు చేస్తుంటారు.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ వ్యాపారాలు, తమిళ సినిమా నిర్మాణాలు చేస్తుంటారని తెలుస్తోంది. ఐటీ దాడుల నేపథ్యంలో బీద మస్తాన్‌రావుతో పాటు ఆయన సోదరుడు నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. 

బెజవాడలో ఐటీ దాడుల కలకలం.. టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు పక్కా వ్యూహం..?

click me!