బెజవాడలో ఐటీ దాడుల కలకలం.. టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు పక్కా వ్యూహం..?

sivanagaprasad kodati |  
Published : Oct 05, 2018, 08:11 AM IST
బెజవాడలో ఐటీ దాడుల కలకలం.. టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు పక్కా వ్యూహం..?

సారాంశం

తెలంగాణలో కలకలం రేపిన ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు మారాయి. విజయవాడలోని పలువురి ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు జరగబోతున్నాయని ప్రచారం జరుగుతుండటంతో నగరంలో కలకలం రేగుతోంది.

తెలంగాణలో కలకలం రేపిన ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు మారాయి. విజయవాడలోని పలువురి ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు జరగబోతున్నాయని ప్రచారం జరుగుతుండటంతో నగరంలో కలకలం రేగుతోంది.

ఢిల్లీ నుంచి వచ్చిన 8 ప్రత్యేక బృందాలు ఆటోనగర్‌లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో మకాం వేశాయి. ఎవరెవరి ఇళ్లపై సోదాలు నిర్వహించాలో తెలుసుకుని.. పక్కా సమాచారంతో రంగంలోకి దిగాయి.

కొద్దిసేపటి క్రితమే ఐటీ ఆఫీస్ నుంచి దాడులు జరపబోయే ప్రముఖుల నివాసాలకు ఐటీ అధికారులు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. రాజకీయ కారణాలతో టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించిన కొద్దిరోజుల్లోనే దాడులు జరుగుతుండటం ప్రాధాన్యత కలిగిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు