అన్నింటికీ కేంద్రమేనా.. పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీ సర్కార్ శ్రద్ధ పెట్టాలి: సోము వీర్రాజు

Siva Kodati |  
Published : Jul 12, 2021, 03:41 PM IST
అన్నింటికీ కేంద్రమేనా.. పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీ సర్కార్ శ్రద్ధ పెట్టాలి: సోము వీర్రాజు

సారాంశం

రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదని ఆరోపించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. కానీ, పోలవరం ప్రాజెక్టును మాత్రం కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలని అనడం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు.  

పోలవరం ప్రాజెక్టు పనులను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సోమవారం పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి ఎల్ఎన్డీ పేట వద్ద నిర్మించిన పునరావాస కాలనీకి వెళ్లారు. అక్కడున్న నిర్వాసితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదని ఆరోపించారు.  కానీ, పోలవరం ప్రాజెక్టును మాత్రం కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలని అనడం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు.

Also Read:నదుల అంశాల మీద తెలంగాణ స్టడీ చేసినట్టు ఏపీ చేయలేక పోయింది.. సోము వీర్రాజు..

పోలవరం ప్రాజెక్టు నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 11 వేల కోట్లను ఇచ్చిందని సోము వీర్రాజు తెలిపారు. ఈ నిధుల్లో ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 11 వేల కోట్లు, పునరావాసానికి రూ. 4 వేల కోట్లను ఖర్చు చేశారని వీర్రాజు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల విషయంలో కూడా శ్రద్ధ వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఏపీ బీజేపీ చీఫ్ అన్నారు. ముంపులో ఉన్న నిర్వాసితులకు వెంటనే ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చి, అక్కడి నుంచి తరలించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్