ఆత్మహత్య కాదు ప్రభుత్వహత్య....రోజా

By rajesh yFirst Published Aug 28, 2018, 3:22 PM IST
Highlights

కర్నూలు జిల్లాలో రైతు దంపతుల ఆత్మహత్యపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న రామయ్య దంపతులది
ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీ కాకపోవడంతో తీసుకున్న అప్పుకు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చెయ్యడంతో భార్యభర్తలు ఆత్మహత్యకు
పాల్పడ్డారని రోజా తెలిపారు. 

తిరుపతి : కర్నూలు జిల్లాలో రైతు దంపతుల ఆత్మహత్యపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న రామయ్య దంపతులది ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీ కాకపోవడంతో తీసుకున్న అప్పుకు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చెయ్యడంతో భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారని రోజా తెలిపారు. 

ఎన్నికల్లో లబ్ధిపొందడానికే సీఎం చంద్రబాబు అబద్ధాల హామీలు ఇచ్చారని మండిపడ్డారు. ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదని, ఈ హామీ వట్టి బూటకమంటూ ఎద్దేవా చేశారు. మహిళల రుణాలు కూడా మాఫీ కాలేదని, ఈ బూటకపు హామీలతో అమాయక ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు కార్మిక ద్రోహి అని, ఆయన పాలనలో చిత్తూరు, రేణిగుంట ఫ్యాక్టరీ, విజయపాల ఫ్యాక్టరీలు మూతబడ్డాయన్నారు. తిరుపతి ఆర్టీసీ గ్యారేజ్‌ మంచి గుర్తింపు పొందిందని కార్మికుల పొట్టకొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి ఆర్టీసీ గ్యారేజ్‌ను ఇతర జిల్లాలకు తరలించేయత్నం జరుగుతోందని, గ్యారేజ్‌ కార్మికులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని  రోజా భరోసా ఇచ్చారు.  

ఈ వార్త కూడా చదవండి

రుణమాఫీ జరగలేదని వృద్ధ దంపతుల ఆత్మహత్య

click me!