బ్రేకింగ్: నిరాహార దీక్షలో విజయసాయి ?

First Published Apr 10, 2018, 4:03 PM IST
Highlights
మొన్నటి 6వ తేదీన ప్రత్యేకహోదా డిమాండ్ తో ఏపి భవన్లో ఐదుగురు ఎంపిలు ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా నిరాహారదీక్షలో కూర్చుంటారా? వైసిపి వర్గాలు అవుననే అంటున్నాయ్. లోక్ సభ సభ్యుల తర్వాత వంతు విజయసాయిదే అంటున్నారు.

మొన్నటి 6వ తేదీన ప్రత్యేకహోదా డిమాండ్ తో ఏపి భవన్లో ఐదుగురు ఎంపిలు ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే,ఐదో రోజుకు ముగ్గురు ఎంపిలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, వైవి సుబ్బారెడ్డిలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరక తప్పలేదు.

ఇక మిగిలింది మిధున్ రెడ్డి, అవినాష్ రెడ్డి మాత్రమే. వీరిద్దరిని కూడా మరో రెండు రోజుల తర్వాత వైద్యులు బలవంతంగా ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయ్.

అంటే పార్టీ లోక్ సభ సభ్యుల దీక్ష పూర్తయిపోతుంది. మరి తర్వాతేం జరుగుతుంది? అంటే, అపుడు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. అయితే దీక్షలో విజయసాయి కూర్చుంటే ఢిల్లీలో ఏదైనా పార్టీ వ్యవహారాలు చక్కబెట్టాలంటే ఎలా అని కూడా జగన్ ఆలోచిస్తున్నారట.

బహుశా వీరిద్దరూ మరో మూడు, నాలుగు రోజుల పాటు దీక్షలో కూర్చునే అవకాశాలున్నాయి. వారి తర్వాత ఎంఎల్ఏలు దీక్షలో కూర్చోవాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారట.

అంటే ప్రత్యేకహోదా డిమాండ్ సజీవంగా ఉంచేందుకు ఎంత అవకాశం ఉంటే అంతా కృషి చేయాలన్నది జగన్ వ్యూహంగా కనబడుతోంది. అప్పటికీ కేంద్రప్రభుత్వం దిగిరాకపోతే ఏం చేయాలో అప్పుడే ఆలొచించుకుంటారు.

click me!