విభిన్న ప్రతిభావంతుల పింఛన్ తీసేయడమేనా సంక్షేమం?.. సీమ పర్వీన్ కు పెన్షన్ తొలగింపుపై చంద్ర‌బాబు ఫైర్

By Mahesh Rajamoni  |  First Published Apr 13, 2023, 12:10 PM IST

Machilipatnam:  మచిలీపట్నం కు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు సీమ పర్వీన్ కు పెన్షన్ తొలగింపుపై తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. వైకాపా ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. పెన్షన్ తొలగింపును ప్రశ్నించిన టీడీపీ అధినేత.. విభిన్న ప్రతిభావంతుల పింఛన్ తీసేయడమేనా సంక్షేమమంటూ ప్ర‌శ్నించారు. 
 


SelfieChallengeToJagan: మచిలీపట్నం కు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు సీమ పర్వీన్ కు పెన్షన్ తొలగింపుపై తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. వైకాపా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. పెన్షన్ తొలగింపును ప్రశ్నించిన టీడీపీ అధినేత.. విభిన్న ప్రతిభావంతుల పింఛన్ తీసేయడమేనా సంక్షేమమంటూ ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు నాయుడు సీమ ప‌ర్వీన్ తో ఫొటో దిగి, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. 

వివ‌రాల్లోకెళ్తే.. చంద్ర‌బాబు నాయుడు మ‌చిలిప‌ట్నం ప‌ర్య‌ట‌న‌లో అక్క‌డ ఉన్న స‌మ‌స్య‌ల‌ను ఎత్తిచూపుతూ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతుల పింఛన్ తీసేయడం గురించి ప్ర‌స్తావించారు. విభిన్న ప్రతిభావంతురాలు సీమ పర్వీన్ కు పెన్షన్ తొలగింపును ప్ర‌శ్నిస్తూ వైకాపా ప్ర‌భుత్వంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆమె ఇంట్లో 300 యూనిట్లకు మించి విద్యుత్ వాడుతున్నారని 90 శాతం వైకల్యంతో  బాధపడుతున్న పర్వీన్ పెన్షన్ తొలగింపును ప్ర‌శ్నించారు. బందరులో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో వేదిక పైకి పర్వీన్ తీసుకువచ్చిన కుటుంబ సభ్యులతో క‌లిసి ఆయ‌న ప్ర‌భుత్వ తీరుపై మండిప‌డ్డారు. .

Latest Videos

undefined

విభిన్న ప్రతిభావంతురాలైన సీమ పర్వీన్ కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మనసెలా వచ్చిందని ప్ర‌శ్నించారు. 18 ఏళ్లు వచ్చినా వైకల్యం కారణంగా తల్లిదండ్రులు చేతులపైనే పెరుగుతున్న ఈ బిడ్డ పెన్షన్ తొలగిస్తారా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడమే సంక్షేమమా? అంటూ ప్ర‌శ్నించారు. సీమ ప‌ర్వీన్ పెన్షన్ కు నాడు అర్హురాలు, నేడు అనర్హురాలు ఎలా అయ్యింది?  అని ప్ర‌శ్నిస్తూ.. 90శాతం వైకల్యం ఉన్న అమెకు నిబంధనల పేరుతో పెన్షన్ తొలగించడమే మానవత్వమా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం క‌చేశారు. 

"వాస్తవంగా చెప్పాలి అంటే వైకల్యంతో ఉంది సీమ ప‌ర్వీన్ కాదు.. మీరు మీ ప్రభుత్వం" అంటూ ఫైర్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే  సీఎం జ‌గ‌న్ కు చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. సంక్షేమ పథకాల్లో ఆంక్షలతో కోతలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. 

 

విభిన్న ప్రతిభావంతురాలైన సీమ పర్వీన్ కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మనసెలా వచ్చింది? 18 ఏళ్లు వచ్చినా తల్లిదండ్రులు చేతులపై పెరుగుతున్న ఈ బిడ్డ పెన్షన్ తొలగిస్తారా? ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడమే సంక్షేమమా?(1/2) pic.twitter.com/y6LU27mCAR

— N Chandrababu Naidu (@ncbn)
click me!