సవాలును స్వీకరించే ధైర్యముందా చంద్రబాబుకు ?

First Published Nov 8, 2017, 3:11 PM IST
Highlights
  • వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సవాలుకు తెలుగుదేశంపార్టీ నేతలు స్పందిస్తారా?
  • ఎదుటివారిపై బురద చల్లటమే కానీ సవాలు స్వీకరించే ధైర్యం టిడిపి నేతలకు ఉండదు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సవాలుకు తెలుగుదేశంపార్టీ నేతలు స్పందిస్తారా? ఎందుకంటే, ఎదుటివారిపై బురద చల్లటమే కానీ సవాలు స్వీకరించే ధైర్యం టిడిపి నేతలకు ఉండదు. తమకు మద్దతిచ్చే ‘పచ్చ పత్రికల’తో ఎదుటి వారిపై దాడులు చేయటం, గబ్బు పట్టించటమే టిడిపి నేతల పని. అదే పనిని గడచిన మూడు రోజులుగా చంద్రబాబునాయుడు మొదలు మంత్రులు, నేతలు నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. ఇంతకీ టిడిపి ఆరోపణలేంటి? ప్యారడైజ్ పేపర్లలో విదేశాల్లో ఆస్తులు కూడగట్టిన భారతీయుల పేర్లలో వైఎస్ జగన్ పేరు కూడా ఉందట. కాబట్టి జగన్ అవినీతి అంతర్జాతీయ స్ధాయికి పాకిందట.

ప్యారడైజ్ పేపర్లలో జగన్ పేరు కనబడగానే మంత్రులు, నేతలు రెచ్చిపోతున్నారు. దానికితోడు పేపర్లో  వార్త వచ్చిన రోజే జగన్ కూడా తన ప్రజా సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారు. జనస్పందన కూడా ఊహించినదానికన్నా ఎక్కువగానే ఉంది. దాంతో మంత్రులు, నేతలు తమ సృతి కూడా పెంచారు. అంటే ఏదో ఒక రకంగా జగన్ పై బురద చల్లటమే లక్ష్యంగా పెట్టుకున్నారన్న విషయం స్పష్టమైపోతోంది.

ఒకవేళ ప్యారడైజ్ పేపర్లలో జగన్ పేరు ఉందనే అనుకుందా, దానికి సంబంధించిన వివరాలు మంత్రులు, నేతలు సేకరించాలి కదా? ఎదుటివారిపై ఆరోపణలు చేసేటప్పుడు పూర్తి వివరాలు దగ్గరుంచుకోవాలని మంత్రులు, నేతలకు అనిపించదు. ఎంతసేపూ ‘దున్నపోతు ఈనింది అనగానే దూడను కట్టేయ’మని చెప్పటమొకటే టిడిపికి తెలుసు. ఆధారాలు లేకపోయిన ప్రత్యర్ధులపై వార్తలు వస్తే చాలు అవే ఆధారాలన్నట్లు రెచ్చిపోవటం టిడిపికి మామూలే. అదే తెహల్కా డాట్ కామ్ లో చంద్రబాబునాయుడుకి విదేశాల్లో ఆస్తులన్నట్లు వివరాలతో ప్రత్యేక కథనం వచ్చినా అవన్నీ ఒట్టి అబద్దాలే అని బుకాయించేస్తారు.

ఇక ప్రస్తుతానికి వస్తే, జగన్ సవాలును టిడిపి స్వీకరిస్తుందా లేదా అన్నదే పెద్ద ప్రశ్న. ప్యారడైజ్ పేపర్లలో వచ్చింది నిజమే అని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని జగన్ స్పష్టంగానే సవాలు చేసారు కదా ? నిరూపించలేక పోతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారా అని నిలదీసారు. మరి జగన్ సవాలుకు స్పందించే ధైర్యం ఉందా టిడిపిలో?

 

click me!