(వీడియో) మొదటసారి ప్రజల్లోకి వచ్చిన నారా భువనేశ్వరి

First Published Aug 31, 2017, 6:52 PM IST
Highlights
  • నారా ఫ్యామిలీలో ఏం జరుగుతోందబ్బా?
  • మొదట కొడుకు, తర్వాత కోడలు, తాజాగా భార్య ఒక్కొక్కరుగా ప్రజల్లోకి వస్తున్నారు.
  • చంద్రబాబునాయుడు భార్య నారా భువనేశ్వరి కూడా గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నారా ఫ్యామిలీలో ఏం జరుగుతోందబ్బా? మొదట కొడుకు, తర్వాత కోడలు, తాజాగా భార్య ఒక్కొక్కరుగా ప్రజల్లోకి వస్తున్నారు. మొదటగా నారా లోకేష్ వచ్చారు. పార్టీలో సమన్వయకర్తగా పనిచేసి తరువాత జాతీయ ప్రధానకార్యదర్శి అయ్యారు. ఎంఎల్సీగా నియమితలై ఇపుడు మంత్రిగా ఉన్నారు. కోడలు నారా బ్రాహ్మణి కూడా రాజకీయాల్లోకి వస్తుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే కదా? గుంటూరు లేదా విజయవాడ పార్లమెంట్ స్ధానాల్లో పోటీ చేయవచ్చని కూడా ప్రచారంలో ఉంది. అయితే, తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యమే లేదని చెప్పినప్పారు. అయినా ప్రచారమైతే ఆగటం లేదు. ఎందుకంటే, చాలా కాలం హెరిటేజ్ ఫుడ్స్ కే పరిమితమైన బ్రాహ్మణి మెల్లిగా వివిధ వేదికలపై కనబడటం ఎక్కువైంది.

తాజాగా చంద్రబాబునాయుడు భార్య నారా భువనేశ్వరి కూడా గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. భువనేశ్వరి ఓ కార్యక్రమంలో పాల్గొనటం 30 ఏళ్ళల్లో ఇదే మొదటిదేమో బహుశా. ఇప్పటి వరకూ హెరిటేజ్ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాల్లోనే కనిపించారు. కృష్ణా జిల్లా పామర్రు పరిధిలోని కొమరోవలు గ్రామంలో కొత్తగా నిర్మించిన 33 /11 కెవి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా పరిషత్ ఛైర్మన్ గద్దె అనూరాధ, స్ధానిక ఎంఎల్ఏ ఉప్పులేటి కల్పన కుడా పాల్గొన్నారు. నిజానికి ఈ కార్యక్రమానికి భువనేశ్వరికి ఏమాత్రం సంబందం లేదు. అయినా మంత్రి తదితరులున్నప్పటికీ భువనేశ్వరే సబ్ స్టేషన్ ఎందుకు ప్రారంబించటంపై చర్చ జరుగుతోంది

click me!