వైసీపీ నిర్ణయంతో చంద్రబాబులో సంతోషం

First Published Oct 29, 2017, 11:51 AM IST
Highlights
  • అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలన్న వైసీపీ నిర్ణయంతో చంద్రబాబునాయుడు సంతోషంగానే ఉన్నట్లుంది.
  • మీడియా సమావేశంలో చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలన్న వైసీపీ నిర్ణయంతో చంద్రబాబునాయుడు సంతోషంగానే ఉన్నట్లుంది. మీడియా సమావేశంలో చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అసెంబ్లీ బహిష్కరణ అంశంపై మాట్లాడుతూ ‘పులిని చూసి నక్క వాత పెట్టుకుంది’ అన్నారు. ఆ వ్యాఖ్యలోనే చంద్రబాబు ఉద్దేశ్యమేంటో అర్ధమైపోతోంది. నిజానికి ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీని బహిష్కరణకు పిలుపిచ్చిందంటే అధికారపక్షం సిగ్గుపడాలి.

ఎందుకంటే, అన్నీ పక్షాలు కలిస్తేనే అసెంబ్లీకి నిండుదనం. కానీ దురదృష్టమేంటంటే ఈ అసెంబ్లీలో ఉన్నవే రెండు పక్షాలు. అందులో ఒకటి అధికార టిడిపి కాగా రెండోది ప్రధానప్రతిపక్ష వైసీపీ. ఉన్న మూడోపక్షం భాజపా ఎటూ మిత్రపక్షమే. అసలు వైసీపీ అసెంబ్లీ బహిష్కరణకు ఎందుకు పిలుపిచ్చింది? చంద్రబాబు ప్రోత్సహస్తున్న ఫిరాయింపులకు నిరసనగానే.

21 మంది వైసీపీ ఎంఎల్ఏలు, 3 ఎంపిలను ప్రలోభాలకు గురిచేసి చంద్రబాబు టిడిపిలోకి లాక్కున్న విషయం అందరికీ తెలిసిందే. అసెంబ్లీ బహిష్కరణ విషయంలో వైసీపీ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారే గానీ ఫిరాయింపులను ప్రోత్సహించటం తప్పని మాత్రం ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ చంద్రబాబుకు అనిపిచటం లేదు. ప్రజాస్వామ్యపు విలువలను చంద్రబాబు ఎంత చక్కగా పాటిస్తున్నరో ఇక్కడే అర్ధమైపోతోంది.

అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయంలో వైసీపీ ఎన్టీఆర్ ను ఆదర్శంగా తసుకుంటోందా? లేకపోతే జయలలితనే ఆదర్శంగా తీసుకుంటోందా అన్నది అప్రస్తుతం. వారెందుకు అసెంబ్లీ బహిష్కరించారు? వైసీపీ ఎందుకు బహిష్కరణ నిర్ణయం తీసుకున్నదన్నదే ప్రధానం ఇక్కడ. ఆ విషయాన్ని మాత్రం చంద్రబాబు మాట్లాడటం లేదు. సరే మూడున్నర సంవత్సరాల్లో వైసీపీ అసెంబ్లీకి హాజరై సాధించిందేంటి ? అంటే ఏమీ లేదనే సమాధానం చెప్పుకోవాలి.

ఎందుకంటే, అసెంబ్లీలో వైసీపీ ఏదన్నా అంశాన్ని ప్రస్తావించాలనుకున్నా టిడిపి ఎదురుదాడితో అడ్డుకున్న విషయం అందరూ చూసిందే. లేదంటే జగన్ ప్రస్తావించిన అంశాలకు సమాధానం చెప్పుకోలేనపుడు జగన్ అక్రమాస్తులు, కోర్టు కేసులు, విచారణలు అంటూ ఆవువ్యాసంతో విరుచుకుపడి సమావేశాలను అర్ధాంతరంగా ముగించేస్తోన్న ఘటనలు ఎన్ని లేవు?

click me!