కాపు రిజర్వేషన్ల పోరాట నేత ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో చేరుతారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
అమరావతి: కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం వైపు ప్రధాన రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఆయా పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 12 నుండి 15 శాతం ఉంటాయి. ఆయా పార్టీల గెలుపు, ఓటములను కాపు సామాజిక వర్గం ఓటర్లు ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల సాధన కోసం గత కొంత కాలంగా ముద్రగడ పద్మనాభం పోరాటం చేస్తున్నారు.
ముద్రగడ పద్మనాభాన్ని తమ వైపునకు తిప్పుకొనేందుకు వైఎస్ఆర్‌సీపీ, తెలుగు దేశం, జనసేన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 1న ముద్రగడ పద్మనాభం నివాసానికి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున వచ్చారు. ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే విషయమై ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం సాగింది. ముద్రగడ తనయుడు, లేదా కోడలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఆయన వర్గీయుల్లో ప్రచారం సాగింది.
వైఎస్ఆర్‌సీపీ నేతలు కూడ ముద్రగడ పద్మనాభంతో టచ్ లోకి వెళ్లినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేసింది. తన తండ్రి ఆదేశిస్తే రాజకీయాల్లోకి రావడానికి ముద్రగడ పద్మనాభం తనయుడు కూడ ప్రకటించిన విషయం తెలిసిందే . అయితే ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో చేరే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.
undefined
also read:ఆపరేషన్ కాపు: ముద్రగడ, వంగవీటి రాధాలకు జగన్ గాలం
ఇదిలా ఉంటే గురువారం నాడు తెల్లవారుజామున జనసేన నేతలు ముద్రగద పద్మనాభంతో భేటీ అయ్యారు. సుధీర్ఘంగా ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపారు. రెండు మూడు రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడ ముద్రగడ పద్మనాభంతో భేటీ అవుతారని ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలోనే జనసేన నేతలు ముద్రగడ పద్మనాభంతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరో వైపు తెలుగు దేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడ ముద్రగడ పద్మనాభంతో భేటీ కానున్నారు. తమ తమ పార్టీల్లో చేరాలని తెలుగు దేశం, జనసేన నేతలు కూడ ముద్రగడ పద్మనాభాన్ని ఆహ్వానించనున్నారని ప్రచారం సాగుతుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుండి పవన్ కళ్యాణ్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది.ఈ తరుణంలో ముద్రగడ పద్మనాభంతో పవన్ కళ్యాణ్ కూడ భేటీ అవుతారనే ప్రచారం రాజకీయంగా చర్చకు దారి తీసింది.
also read:పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పోటీ: వై.ఎస్. జగన్ స్కెచ్ ఇదీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ముద్రగడ పద్మనాభం ఇంటికి క్యూ కడుతున్నారు. తమ పార్టీల్లో చేరాలని కోరుతున్నారు. ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో చేరుతారనేది ప్రస్తుతం అంతా ఆసక్తికరంగా చూస్తున్నారు.