విజయనగరంకు చెందిన పూసపాటి రాజవంశీకులు అశోక గజపతి రాజు అతి సాధారణ వ్యక్తిలా రైలు ప్రయాణం చేసారు. భార్యతో కలిసి హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో ఆయన కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబద్ : ఆయనది ఓ రాజకుంటుంబం. వెలకట్టలేని ఆస్తులు ఆయన సొంతం. రాజకీయంగా కూడా ఉన్నత పదవుల్లో కొనసాగారు. కానీ రాజకుటుంబ వారసుడిగా, రాజకీయ నాయకుడిలా వుండేకంటే సామాన్యుడిలా వుండేందుకే ఆయన ఇష్టపడతారు. అనుకుంటే చార్టెడ్ ప్లైట్స్ లో ప్రయాణించవచ్చు... కానీ అతి సామాన్యుడిలా రైలులో ప్రయాణిస్తారు. ఇంత సింపుల్ జీవితం గడిపే ఆ రాజకుటుంబ వారుసులు మరెవరో కాదు విజయనగరంకు చెందిన పూసపాటి అశోక గజపతిరాజు.
గత మంగళవారం వ్యక్తిగత పనులపై అశోక గజపతిరాజు కుటుంబసభ్యులతో కలిసి మహారాష్ట్రకు పయనమయ్యారు. అనుకుంటే ఏ విమానంలోనో లేదంటే ఖరీదైన కార్లలో ఆ రాజకుటుంబం మహారాష్ట్రకు వెళ్లవచ్చు... కానీ వారు అత్యంత సింపుల్ గా రైల్లో ప్రయాణించారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్య ప్రయాణికుల్లా హైదరాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు అశోక్ గజపతిరాజు కుటుంబసభ్యులు. ఈ క్రమంలోనే రైల్వే ప్లాట్ ఫారంపై అశోక్ - సునీల గజపతి రాజు దంపతులు కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజుగారి కుటుంబం మరీ ఇంత సింపుల్ గా రైలు ప్రయాణం చేయడంపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
పూసపాటి రాజవంశానికి చెందిన అశోక గజపతిరాజు ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా పనిచేసారు. రాష్ట్ర మంత్రివర్గంలోనే కాదు గత కేంద్ర ప్రభుత్వంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేసారు.అలాగే మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా కూడా అశోక గజపతిరాజు కొనసాగుతున్నారు. ఇలా వ్యక్తిగతంగా రాజకుటుంబం, దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నా ఆయన మాత్రం సామాన్యులకు దూరం కాలేదు. ఎన్ని కోట్ల ఆస్తులున్నా... ఎంతటి పదవిలో వున్నా సాధారణ మద్యతరగతి జీవితాన్ని గడుపుతుంటారు అశోక గజపతిరాజు.
Also Read వైసీపీలో నా కల నెరవేరుతుందని అనిపించలేదు.. అందుకే జనసేనలోకి - అంబటి రాయుడు
విజయనగరంలోని గజపతుల బంగ్లాలో వుంటున్నా అశోక గజపతిరాజు ఎలాంటి హంగు ఆర్భాటాలు ప్రదర్శించరు. స్కూటీ, నానో కార్లలో విజయనగరం రోడ్లపైకి వస్తుంటారు... అప్పుడప్పుడు కాలినడకన కూడా కనిపిస్తుంటారు. ఇలా రాజకీయాల్లో హుందాగా వుంటూనే సింపుల్ జీవితం గడుపుతున్న అశోక గజపతిరాజు ఫోటో మరోసారి వైరల్ గా మారింది.