సెక్స్ రాకెటీర్ తో మంత్రికి సంబంధాలా ?

Published : Nov 09, 2017, 10:34 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
సెక్స్ రాకెటీర్ తో మంత్రికి సంబంధాలా ?

సారాంశం

కాల్ మనీ సెక్స్ రాకెటీర్ తో మంత్రి ఆదినారాయణరెడ్డికి లింకులున్నాయా?

కాల్ మనీ సెక్స్ రాకెటీర్ తో మంత్రి ఆదినారాయణరెడ్డికి లింకులున్నాయా? సెక్స్ రాకెట్ లో పట్టుబడిన వారిలో ప్రధాన నిందితునితో మంత్రి కులాసాగా భోజనం చేస్తున్న దృశ్యాలు వెలుగు చూడటంతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. రెండేళ్ళ కిందట విజయవాడ కేంద్రంగా కాల్ మనీ సెక్స్ రాకెట్  సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. అధికారపార్టీలోని ప్రముఖుల అండదండలతో జరిగిన సెక్స్ కుంభకోణం అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేలాదిమంది మహిళల అవసరాలను గుర్తించి రాకెట్ సూత్రదారులు వేలాది రూపాయలు అప్పులిచ్చారు. తర్వాత అప్పు తీర్చమంటూ వారిని వేధించారు. అసలు, వడ్డీలు కట్టలేక మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారు. దాన్ని అవవకాశంగా తీసుకున్న రాకెట్ లోని ప్రముఖులు అప్పు తీర్చలేని వారిలో పలువురితో బలవంతంగా సెక్స్ సంబంధాలు పెట్టుకున్నారు. తర్వాత వాటని సిడిగా మార్చి ఆ మహిళలకే చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ రావాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తాలను గుంజుకున్నారు.

అటువంటి పరిస్ధితుల్లో బాధిత మహిళలుఃలో ఒకరిద్దరు తెగించి పోలీసు కమీషనర్ కు చేసిన ఫిర్యాదుతో డొంకంతా కదిలి దేశవ్యాప్తంగా సంచలనమైంది. అప్పుడే అధికార పార్టీలోని ప్రముఖల బండారం కూడా బయటపడింది. సరే, ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారన్నది వేరే సంగతి. ప్రముఖుల జోలికి వెళ్ళకపోయినా కొందరిని మాత్రం పోలీసులు అరెస్టులు చేసారు. తర్వాత కోర్టులో విచారణ కూడా మొదలైంది లేండి.

అప్పట్లో పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రదాన నిందితుడైన (ఏ1) యలమంచిలి శ్రీరామమూర్తి (రాము)తో మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి ఓ హోటల్లో కులాసాగా భోజనం చేస్తూ పలువురి కంబపడ్డారు. దాంతో ఆ విషయం ఆ నోట ఈ నోట బయటకు పొక్కటంతో పార్టీతో పాటు ప్రభుత్వంలో పెద్ద చర్చ మొదలైంది.

ఎప్పుడైతే విషయం బయటకు పొక్కిందని తెలుసుకున్నారో మంత్రి బుకాయించటం మొదలుపెట్టారు. తాను ఓ హోటల్లో భోజనానికి వెళ్లింది వాస్తవమే కానీ అక్కడ 15 మందున్నట్లు చెబుతున్నారు. అందులో రాము ఎవరో మంత్రికి తెలీదట. అందరితో కలిసి భోజనం చేస్తుంటే తీసిన ఫొటోల్లో మిగిలిన వారిని కట్ చేసి రాముతో భోజనం చేస్తున్నట్లు అనవరంగా రాద్దాంతం చేస్తున్నారంటూ మంత్రి మండిపడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Vizag Police Commissioner: తాగి రోడ్డెక్కితే జైలుకే విశాఖ పోలీస్ హెచ్చరిక | Asianet News Telugu
Dwadasi Chakra Snanam in Tirumala: ద్వాదశి సందర్బంగా తిరుమలలో చక్రస్నానం | Asianet News Telugu