బ్రేకింగ్ న్యూస్: త్వరలో వైసిపిలోకి బాపిరాజు ?

Published : Mar 09, 2018, 12:34 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
బ్రేకింగ్ న్యూస్: త్వరలో వైసిపిలోకి బాపిరాజు ?

సారాంశం

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు మాజీ సభ్యుడు కనుమూరి బాపిరాజు త్వరలో వైసిపిలో చేరటానికి రంగం సిద్ధమైందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇటు కృష్ణా, అటు గోదావరి జిల్లాల్లో బాగా పట్టున్న బాపిరాజు గనుక వైసిపిలో చేరితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి మంచి ఊపు రావటం ఖాయమని నేతలు భావిస్తున్నారు. అందుకని ఎలాగైనా బాపిరాజు వైసిపిలో చేరేట్లుగా ప్రయత్నాలు చేశారట.

అదే సమయంలో కాంగ్రెస్ లోనే కొనసాగితే భవిష్యత్ ఉండదన్న విషయం బాపిరాజుకు కూడా బాగా అర్ధమైందట. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపధ్యంలో టిడిపి లేదా బిజెపిలో చేరితే నష్టమే తప్ప ఉపయోగం ఉండదన్న ఉద్దేశ్యంతో బాపిరాజు కూడా వైసిపి వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దానికితోడు బాపిరాజు మద్దతుదారుల్లో చాలామంది వైసిపిలో చేరితేనే బాగుంటుందని సూచించారట.

బాపిరాజు వైసిపిలో చేరితే కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఊపురావటం ఖాయం. ఎందుకంటే, పై రెండు జిల్లాల్లో క్షత్రియ సామాజికవర్గం ప్రభావం కొన్ని ప్రాంతాల్లో ఎక్కువుంది. అందులోనూ కృష్ణా జిల్లా కన్నా గోదావరి జిల్లాలో ఇంకా ఎక్కువ. పోయిన ఎన్నికల్లో పై రెండు జిల్లాలోని క్షత్రియ సామాజికవర్గం పూర్తిగా జగన్ కు దూరం అవటం వల్లే దారుణంగా దెబ్బతింది.

కాబట్టి వచ్చే ఎన్నికల్లో పై రెండు జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించాలంటే బాపిరాజు లాంటి నేతలు అవసరమని జగన్ కూడా భావిస్తున్నారు. గుంటూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంగానే ఓ బహిరంగ సభ నిర్వహించి బాపిరాజుతో పాటు పలువురు నేతలను వైసిపిలోకి ఆహ్వానించేందుకు రంగం సిద్దమవుతోందని పార్టీ వర్గాలు చెప్పాయి.

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu