రాష్ట్రంలో ఉన్నది ‘ఆంధ్రజ్యోతి ప్రభుత్వమా’ ?

First Published Feb 28, 2018, 2:07 PM IST
Highlights
  • ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కళ్ళు మూసుకుపోతే పర్యవసానాలు ఇలాగే ఉంటుంది.

ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కళ్ళు మూసుకుపోతే పర్యవసానాలు ఇలాగే ఉంటుంది. ప్రభుత్వం నుండి బయటకు వస్తున్న సర్క్యులర్లు ఏ విధంగా వస్తున్నాయో కూడా చూసుకోవటం లేదు. ఫలితంగా ప్రభుత్వం అందరిముందు నవ్వులపాలవుతోంది.

మొన్నటి మొన్న ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో చంద్రబాబునాయుడును ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రిగా ఇన్విటేషన్లో ముద్రించారు. అలాగే, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ను ఏపి గవర్నర్ గా ముద్రించారు. అదికూడా ముఖ్యమంత్రి పేరు క్రింద గవర్నర్ పేరు ప్రింట్ చేశారు. ఇన్విటేషన్లు చూసిన వారందరూ నవ్వుకున్నారు.

అటువంటిదే తాజాగా మరో ఉదాహరణ చోటు చేసుకుంది. దేవాదాయ శాఖ నుండి బయటకొచ్చిన ఓ సర్క్యులర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఉండాల్సిన చోట ‘ఆంద్రజ్యోతి ప్రభుత్వం’ అని ప్రింటైంది. ప్రభుత్వ వ్యవహారాలన్నింటినీ అధికారికంగా ఆంధ్రజ్యోతి సంస్ధే ప్రసారాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆంద్రజ్యోతి సంస్ధ చంద్రబాబుకు ఎంత సన్నిహితమో అందరికీ తెలిసిందే. అంత మాత్రానా ఏకంగా ప్రభుత్వాన్నే  ‘ఆంధ్రజ్యోతి ప్రభుత్వం’ అని సర్క్యులర్ గా ప్రింట్ చేస్తే ఎలా?

click me!