కంచి పీఠాధిపతి మృతికి మోడి సంతాపం

First Published Feb 28, 2018, 12:44 PM IST
Highlights
  • జగద్గురు పూజ్యశ్రీ కంచిపీఠాధిపతి జయేంద్రసరస్వతి పరమపదించటంపై ప్రధానమంత్రితో సహా అనేకమంది నివాళులర్పించారు.

ప్రధానమంత్రి సంతాపం జగద్గురు పూజ్యశ్రీ కంచిపీఠాధిపతి జయేంద్రసరస్వతి పరమపదించటంపై ప్రధానమంత్రితో సహా అనేకమంది నివాళులర్పించారు. హిందుమతాన్ని, హిందు ధర్మాన్ని వ్యాప్తి చేయటంలో కంచిపీఠం ఎనలేని కృషి చేసినట్లు ప్రధాని తన సంతాపంలో పేర్కొన్నారు.

Deeply anguished by the passing away of Acharya of Sri Kanchi Kamakoti Peetam Jagadguru Pujyashri Jayendra Saraswathi Shankaracharya. He will live on in the hearts and minds of lakhs of devotees due to his exemplary service and noblest thoughts. Om Shanti to the departed soul. pic.twitter.com/pXqDPxS1Ki

— Narendra Modi (@narendramodi)
మఠం ద్వారా కేవలం ధార్మిక కార్యక్రమాలనే కాకుండా సమాజానికి ప్రత్యేకించి పేదల అభ్యున్నతికి జయేంద్రసరస్వతి ఎనలేని సేవలందించారంటూ ప్రధాని ఘన నివాళులర్పించారు. జయేంద్ర హాఠాన్మరణం సమాజానికి తీరని నష్టమన్నారు. కోట్లాది మంది భక్తుల హ్రుదయాల్లో పీఠాధిపతి చెరగని ముద్ర వేసుకున్నట్లుగా అభివర్ణించారు.

Jagadguru Pujyashri Jayendra Saraswathi Shankaracharya was at the forefront of innumerable community service initiatives. He nurtured institutions which transformed the lives of the poor and downtrodden. pic.twitter.com/s1vTpSxbbl

— Narendra Modi (@narendramodi)

అదే విధంగా చంద్రబాబునాయుడు కూడా తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మృతి విచారకరమన్నారు. కంచి అభివృద్ధికి, సమాజ వికాసానికి జయేంద్ర సేవలు చిరస్మరణీయమన్నారు.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మృతి విచారకరం. కంచి పీఠం అభివృద్ధికి... విద్యా వికాసానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

— N Chandrababu Naidu (@ncbn)

 

 

click me!