చంద్రబాబును కోలుకోలేని దెబ్బ కొట్టిన మోడి

First Published Feb 3, 2018, 2:38 PM IST
Highlights
  • ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ రాజధాని నగరాల్లో ఒకటిగా చేస్తానన్నారు.

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో చంద్రబాబునాయుడులో జ్ఞానోదయం అయిందా? ఎందుకంటే, ఇంతకాల అమరావతి అంటే అదేదో దేవతులు నివశించే నగరమని, ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అంటూ ఇంతకాలమూ ఊదరగొట్టారు. ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ రాజధాని నగరాల్లో ఒకటిగా చేస్తానన్నారు. దేశంలో మూడు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా చేసేస్తానని చెప్పారు. ఇదంతా ఎప్పటికయ్యా అంటే మరో 2029కట.

సరే, ఇప్పుడేంటి అని అడిగిన వాళ్ళకు అమరావతి గ్రాఫిక్స్ చూపించి కాలాన్ని నెట్టుకొస్తున్నారు. 2018 కల్లా రాజధాని మొదటి విడత నిర్మాణాలు పూర్తి చేస్తామని పచ్చపత్రికల్లో తెగ రాయించుకున్నారు. ప్రపంచం సంగతి దేవుడెరుగు అసలు కేంద్రమే అమరావతిని గుర్తించలేదన్న విషయం తాజాగా బయటపడింది.

అమరావతికి మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని చంద్రబాబు అనుకున్నారు. ఇంకేముంది పుస్తకాలమీద పనులు చక చకా జరిగిపోయాయి. ప్రాజెక్టు రిపోర్టు కూడా రెడీ అయిపోయింది. దాన్ని కేంద్రానికి పంపించేశారు. నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి కూడా తెస్తున్నారు. అమరావతికి మెట్రోరైలు ఏ విధంగా చూసినా లాభదాయకం కాదని మెట్రో పితామహునిగా పేరున్న మెట్రో సలహాదారుడు శ్రధరన్ తేల్చి చెప్పేసారు.

మెట్రో రైలు సాధ్యం కాదనటంతో మోనో రైలన్నారు. అదీ కుదరదనటంతో లైట్ మోనో రైలన్నారు. ఇలా...ప్రపంచంలో ఎన్ని రకాల రైళ్ళున్నాయో అన్నింటి పేర్లనూ వాడేసుకున్నారు. సరే, ఏ విధంగా ప్రచారం చేయించుకున్న అంతిమంగా ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వాల్సింది మాత్రం కేంద్రమే కదా?

అందుకే గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అందరూ ఆశక్తిగా చూశారు. తీరా చూస్తే ఏపి ప్రాజెక్టుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా ఇతర రాష్ట్రాల్లోని మెట్రో ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయించిన కేంద్రం ఏపికి మొండిచెయ్యే చూపింది. దాంతో చంద్రబాబుకు పెద్ద షాకే తగిలింది.

ఇంతా చేసి అమరావతి మెట్రోకు కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలలిలో పెద్ద చర్చే జరిగింది. స్వయంగా చంద్రబాబే చెప్పిందేమిటంటే ‘ మెట్రో రైలుకు నిధులు ఇవ్వాలంటే కేంద్రం దృష్టిలో అమరావతి ఇటు పల్లె కాదు అటు పట్నం కాదేమో’ అని చల్లగా చెప్పారు చంద్రబాబు. అంటే అర్ధమేంటి? అమరావతిని కేంద్రం ఇంత వరకూ గుర్తించలేదనే కదా?

click me!