చంద్రబాబుకు త్వరలో పెద్ద షాక్ ?

First Published Feb 1, 2018, 12:11 PM IST
Highlights
  • అశోక్ గజపతిరాజుకు ఈ మధ్య చంద్రబాబునాయుడుతో సరిగా పొసగటం లేదు.

సీనియర్ నేత, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు త్వరలో తెలుగుదేశంపార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? ఎన్టీఆర్ టిడిపిని పెట్టినప్పటి నుండి పార్టీలోనే ఉన్న అశోక్ గజపతిరాజుకు ఈ మధ్య చంద్రబాబునాయుడుతో సరిగా పొసగటం లేదు. ఆ విషయాన్ని గ్రహించే రాజుకు ప్రధానమంత్రి నరేంద్రమోడి గాలమేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎటూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని స్వయంగా రాజుగారే ప్రకటించారు. విజయనగరం ఎంపిగా ఉన్న రాజుగారు వచ్చే ఎన్నికల్లో తన కూతురును పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు.

అయితే, అందుకు చంద్రబాబు ఎంత వరకూ సానుకూలమో తెలీదు. ఎందుకంటే, 30 ఏళ్ళుగా అశోక్ కు జిల్లాలో తిరుగులేదు. ప్రభుత్వంలో ఉన్నపుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నపుడు కానీ రాజగారు ఏమనుకుంటే అది జరిగేది. ఒకపుడు ఎన్టీఆర్ కూడా విజయనగరం జిల్లా విషయాల్లో వేలు పెట్టే వారు కారట.

అటువంటిది ప్రస్తుతం రాజుగారు పట్టుబడుతున్నా ఏ పని జరగటం లేదు. జిల్లాలోని రాజు వ్యతిరేకులను చంద్రబాబు పెంచి పోషిస్తున్నారు. అశోక్ వ్యతిరేకులకు చంద్రబాబు పెద్ద పీట వేస్తున్నారు. జిల్లాకు ఇన్చార్జిగా మంత్రి గంటా శ్రీనివాసరావును ఏరికోరి చంద్రబాబు నియమిచారు.

వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాలోని నెల్లిమర్ల నుండి పోటీ చేయాలని చూస్తున్న గంటా జిల్లాలో ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకునే పనిలో పడ్డారు. అందుకనే కొందరినీ చేరదీస్తున్నారు. గంటా చేరదీస్తున్నవారంతా రాజు వ్యతిరేకులేనట. జిల్లా అధ్యక్షుని నియామకం కూడా రాజు వ్యతిరేకించిన వారికే దక్కింది. అప్పటి నుండి జిల్లా రాజకీయాలతో అశోక్ అంటీ ముట్టనట్లుంటున్నారు.

ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి దృష్టికి చేరుతున్నాయట. అందుకనే ఇటీవల అశోక్ ను ప్రధాని ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారట. టిడిపిలోని కొందరి పేర్లు చెప్పి వీళ్ళ మధ్య ఎంతకాలం ఉంటారని ప్రశ్నించారని ప్రచారం జరుగుతోంది. ఎటూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం లేదుకాబట్టి టిడిపికి రాజీనామా చేస్తే ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారట. మోడి మాటలను బట్టి చూస్తే టిడిపికి రాజీనామా చేయటమంటే అర్ధమేంటి? భాజపాలో చేరమని ఆహ్వానించటమే కదా? మోడి మాటలను బట్టి చూస్తే మిత్రపక్షం టిడిపికే ఎసరుపెట్టాలని చూస్తున్నట్లు లేదు?

 

click me!