వచ్చే ఎన్నికలకు రాజుగారు దూరమేనా?

First Published Jun 19, 2017, 11:04 AM IST
Highlights

భవిష్యత్తులో కూడా తన మాట చెల్లుబాటు అయ్యే అవకాశాలు లేవన్నది కేంద్రమంత్రికి అర్ధమైపోయింది. ఎటుతిరిగి జిల్లాలోని తన వ్యతిరేకులందరినీ గంటా చేరదీస్తారు. కాబట్టి జిల్లా రాజకీయం అంతా ఇకపై తనకు వ్యతిరేకరంగానే జరుగుతుందన్న అనుమానం రాజుగారిలో మొదలైందట. 

కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంటారా? జిల్లాలో మొదలైన పరిణామాలు అవుననే అంటున్నాయి. జిల్లాలో జరుగుతున్న పరిణామాలతో రాజుగారు కలతచెందారని పార్టీ వర్గాలే చెబుతున్నాయ్. జిల్లా అధ్యక్షపదవి నుండి తనకు బాగా సన్నిహితుడైన ద్వారపురెడ్డిజగదీష్ ను పక్కన పెట్టేయటమే ఇందుకు నిదర్శనంగా రాజుగారు భావిస్తున్నారు. తన మద్దతుదారుడిని పక్కన పెట్టేయటమే కాకుండా తాను వ్యతిరేకించిన మహంతి చిన్నంనాయడుని చంద్రబాబు ఎంపిక చేసారు.

మహంతి మంత్రి గంటాశ్రీనివాసరావు మద్దతుదారుడు. అశోక్ టిడిపిలోకి వచ్చినప్పటి నుండి ద్వారపురెడ్డి కేంద్రంమంత్రితోనే ఉంటున్నారు. అంతేకాకుండా గడచిన 30 ఏళ్ళుగా విజయనగరం జిల్లాకు సంబంధించి పార్టీ, ప్రభుత్వంలో అశోక్ చెప్పిందే వేదం. అశోక్ మాటను కాదని అప్పట్లో ఎన్టీఆర్ అయినా మొన్నటి వరకూ చంద్రబాబైనా ఏం చేసేవారు కాదు.

అటువంటిది ద్వారపురెడ్డిని జిల్లా అధ్యక్ష పదవి నుండి తప్పిస్తారని మొదలైన ప్రచారాన్ని అడ్డుకోవాలని అశోక్ సిఎంకు సూచించినా చంద్రబాబు పట్టిచుకోలేదు. పైగా అశోక్ వ్యతిరేకంగా ఉండే గంటాకు జిల్లా ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పజెప్పారు. దాంతో అశోక్ లో కూడా చంద్రబాబు వైఖరిపై అనుమానాలు మొదలయ్యాయి.

ఆ అనుమానాలనే నిజం చేస్తూ జిల్లా అధ్యక్షుల పేర్లలో విజయనగరం జిల్లా అధ్యక్షునిగా మహంతి చిన్నంనాయుడును ప్రకటించారు. ద్వారపురెడ్డినే అధ్యక్షునిగా కొనసాగించేందుకు చివరిరోజు వరకూ అశోక్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో అశోక్ మాట చెల్లుబాటు కాలేదన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. దాంతో అశోక్ తీవ్ర నిరాసలో ముణిగిపోయారు.

భవిష్యత్తులో కూడా తన మాట చెల్లుబాటు అయ్యే అవకాశాలు లేవన్నది కేంద్రమంత్రికి అర్ధమైపోయింది. ఎటుతిరిగి జిల్లాలోని తన వ్యతిరేకులందరినీ గంటా చేరదీస్తారు. కాబట్టి జిల్లా రాజకీయం అంతా ఇకపై తనకు వ్యతిరేకరంగానే జరుగుతుందన్న అనుమానం రాజుగారిలో మొదలైందట. అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండే విషయమై సన్నిహితులతో మంతనాలు చేస్తున్నారట.

click me!