
కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని లొల్లలాకుల ఇరిగేషన్ క్వార్టర్స్‌లో దారుణం జరిగింది. ఇరిగేషన్ శాఖ ఉద్యోగి ఒకరు యువతులు దుస్తులు మార్చుకుంటుండగా తన సెల్‌ఫొన్‌లో రికార్డు చేశాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది. కార్తీక వనభోజనాల వేడుకలో డ్యాన్సులు చేసేందుకు వచ్చిన అమ్మాయిలకు దుస్తులు మార్చుకునేందుకు ఇరిగేషన్ క్వార్టర్స్‌లో రూమ్ ఇచ్చారు.
అయితే ప్లాన్ ప్రకారం ముందుగానే రూమ్‌లో సెల్‌ఫోన్ అమర్చి ... యువతులు దుస్తులు మార్చడాన్ని రికార్డ్ చేశాడు కీచక ఉద్యోగి. అయితే రూమ్‌లో ఫోన్ కనిపించడంతో షాక్‌కు గురయ్యారు యువతులు. స్థానికులకు చెప్పడంతో ఇరిగిషన్ ఉద్యోగికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఆత్రేయపురం పోలీసులకు సెల్‌ఫోన్‌తో పాటు ఇరిగేషన్ శాఖ ఉద్యోగిని అప్పగించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.