తప్పుడు కేసులతో అరెస్ట్ చేసే అవకాశం: ఐపీఎస్ అధికారుల సంఘానికి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

By narsimha lode  |  First Published Jan 5, 2021, 2:45 PM IST

తప్పుడు కేసులతో తనను అరెస్ట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం ఉందని ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు.



అమరావతి: తప్పుడు కేసులతో తనను అరెస్ట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం ఉందని ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు.ఐపీఎస్ అధికారుల సంఘానికి మంగళవారంనాడు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశాడు. ఈ లేఖలో పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. 

తన సస్పెన్షన్ ను హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు. ఐపీఎస్ అధికారుల సంఘం జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన ఐపీఎస్ అధికారుల సంఘానికి లేఖ రాశారు.

Latest Videos

నెలల తరబడి తనకు పోస్టింగ్ జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని  ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని ప్రాజెక్టులో తాను అవినీతిని చేశానని విచారణ జరిపారన్నారు.

ఐపీఎస్ అధికారుల నుండి ఎలాంటి ఫేవర్ అడగడం లేదన్నారు. అయితే ఐపీఎస్ ల సంఘం స్పందించాల్సిన సమయం వచ్చిందని ఆయన తెలిపారు.
జైల్లో పెట్టి సస్పెండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా అనుమానం ఉందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. 
 

click me!