
ఏపీలో సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఏటా పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. అయితే ఈ సారి దానిని కౌలు రైతులకూడా కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. దేశంలోని ఏ రాష్ట్రం చేయని విధంగా మొట్టమొదటి సారిగా కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించనున్నారు. అయితే వాస్తవానికి 2023–24 సీజన్ కోసం అందించే తొలి విడత పెట్టుబడి సాయం ఈరోజు (గురువారం) ప్రారంభమవ్వాల్సి ఉండగా.. దానిని రేపటికి (శుక్రవారం) వాయిదా వేశారు.
‘ముస్లిం మహిళతో కలిసి తిరగడానికి నీకెంత ధైర్యం’- అహ్మదాబాద్ లో హిందూ యువకుడిపై దాడి.. వీడియో వైరల్
దీనిని సెప్టెంబర్ 1వ తేదీన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమకానున్నాయి. ప్రతీ ఏటా ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద భూ యజమానులుక రూ.13,500 చొప్పున పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందిస్తోంది. అయితే ఈ సారి కేవలం భూ యజమానులకే కాకుండా కౌలు రైతులు, దేవాదాయ, అటవీ భూములు సాగుచేస్తున్న రైతన్నలకూ సాయం అందనుంది.
జిమ్ ట్రైనర్ రాహుల్ హత్య కేసులో కొత్త కోణం.. ఆ రోజు వీడియో కాల్ మాట్లాడింది ఎవరితో అంటే ?
దీంతో ఆ కౌలు రైతులగా ఉన్న వాస్తవ సాగుదారులందరికీ భూ యజమానులతో పాటే రూ.13,500 వారి బ్యాంకు అకౌంట్లలో జమకానుంది. ఈ వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయడం ఇది ఐదో ఏడాది. ఈ పథకం కింద రైతులకు మూడు విడతల్లో సాయం అందుతుంది. మే నెలలో మొదటి విడతగా రూ.7,500 అందిస్తారు. అలాగే అక్టోబర్ లో రూ.4 వేలు ఇస్తారు. మూడో విడతగా జనవరిలో రూ.2 వేలు అందజేస్తారు. ఇవి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ అవుతాయి.