భర్త ద్వారా పరిచయం.. పలుమార్లు భార్యపై టీడీపీ నాయకుడి లైంగిక వేధింపులు..

Published : Aug 03, 2023, 08:11 AM IST
భర్త ద్వారా పరిచయం.. పలుమార్లు భార్యపై టీడీపీ నాయకుడి లైంగిక వేధింపులు..

సారాంశం

ఓ వివాహితపై టీడీపీ నాయకుడు లైంగిక వేధింపులు పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అతడిపై ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగిస్తున్నారు. 

ఆమె ఓ వివాహిత. భర్త ద్వారా ఓ టీడీపీ నాయకుడు పరిచయం అయ్యాడు. దానిని ఆసరాగా తీసుకొని అతడు ఆమెపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సోదరుడి వరసయ్యే వ్యక్తితో కలిసి దిగిన ఫొటోలను అందరికీ షేర్ చేస్తానంటూ ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

సెల్ ఫోన్ ఛార్జర్ స్విచ్చ్ ఆఫ్ చేయడం మర్చిపోయిన తండ్రి.. పిన్ను నోట్లో పెట్టుకొని 8 నెలల చిన్నారి మృతి

పోలీసులు, బాధితురాలు ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన యువతి ఆరు సంవత్సరాల కిందట ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏడాది కిందట భర్త ద్వారా ఆమెకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి అనుచరుడు, ఆ పార్టీకి క్లస్టర్ ఇన్ ఛార్జ్ గా ఉన్న మార్కెట్ మహేష్ అనే వ్యక్తి పరిచయం ఏర్పడింది. అతడు అంబార్ గేరి ప్రాంతానికి చెందిన వ్యక్తి.. కాగా ప్రస్తుతం భవానీ నగర్ లో ఉంటున్నాడు.

కరెంట్ షాక్ తో ఏనుగు మృత్యువాత.. అన్నమయ్య జిల్లాలో ఘటన

అయితే ఆ వివాహితకు పరిచయం అయిన నాటి నుంచి పలుమార్లు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. కాగా గత నెల జూలై 27వ తేదీన తన భర్త, మిత్రులు అంతా కలిసి గోవా టూర్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. టూర్ కు వెళ్లే ముందు భర్తకు వేరే పని ఉండటంతో అతడు ఆగిపోయి, భార్యను గోవాకు పంపించాడు. 

అప్పటి వరకు సభకు రాను.. సభ్యుల తీరుతో స్పీకర్ ఓం బిర్లా కలత

గోవాలో ఆ వివాహిత తనకు సోదరుడి వరస అయ్యే వ్యక్తితో కలిసి ఫొటోలు దిగింది. వీడియోలు తీసుకుంది. వీటిని మహేష్ ఎవరి ద్వారానో తన వద్దకు తెప్పించుకున్నాడు. వాటి ద్వారా వివాహితను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తన కోరిక తీర్చాలని, లేకపోతే ఆ ఫొటోలు, వీడియోలను భర్త, అలాగే మరి కొందరికి పంపింస్తానని ఆమెను హెచ్చరించాడు. అతడి చేష్టలతో విసిగిపోయిన బాధితురాలు బుధవారం వన్ టౌన్ పోలీసు స్టేషన్ ను ఆశ్రయించింది. మహేష్ వేధింపులపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నారు.

PREV
click me!

Recommended Stories

BR Naidu Press Meet: దేశం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్: బీఆర్ నాయుడు| Asianet Telugu
Swathi Deekshith & Pranavi Manukonda Visit Tirumala Temple: శ్రీవారిసేవలో ప్రముఖులు | Asianet Telugu