కరెంట్ షాక్ తో ఏనుగు మృత్యువాత.. అన్నమయ్య జిల్లాలో ఘటన

Published : Aug 03, 2023, 07:22 AM IST
కరెంట్ షాక్ తో ఏనుగు మృత్యువాత.. అన్నమయ్య జిల్లాలో ఘటన

సారాంశం

కరెంట్ షాక్ తో ఓ గజరాజు మృత్యువాత పడింది. ఈ ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. మామిడి తోటకు రక్షణ కల్పించేందుకు ఓ రైతు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి ఆ ఏనుగు ప్రాణాలు కోల్పోయింది.

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఘోరం జరిగింది. రైల్వేకోడూరు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఓ ఏనుగు మరణించింది. ఆ గ్రామంలోని ఓ మామిడి తోటలో ఆ గజరాజు కరెంట్ షాక్ తో మృత్యువాత పడింది. ఈ విషాయాన్ని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. 

సెల్ ఫోన్ ఛార్జర్ స్విచ్చ్ ఆఫ్ చేయడం మర్చిపోయిన తండ్రి.. పిన్ను నోట్లో పెట్టుకొని 8 నెలల చిన్నారి మృతి

ఫారెస్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీపురం గ్రామంలో ఓ మామిడి తోట ఉంది. అయితే పంటను కోతులు వచ్చి పాడు చేస్తుంటాయి. తోటను చిందర వందర చేస్తుంటాయి. దీంతో వాటి నుంచి పంటను రక్షించుకునేందుకు ఆ తోట యజమాని పొలం చుట్టూ కరెంట్ వైర్ పెట్టాడు. దానికి విద్యుత్ సరఫరా చేశాడు. 

దారుణం.. బాలికపై పలుమార్లు మేనబావ, అతడి స్నేహితులు అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొకరు..

అయితే బుధవారం తెల్లవారుజామున శేషాచలం అడవుల నుంచి ఓ ఏనుగు ఆ పొలం వైపు వచ్చింది. ఆ మామిడి తోటను దాటే క్రమంలో ఆ విద్యుత్ వైర్లను తాకింది. దీంతో ఒక్క సారిగా దానికి కరెంట్ షాక్ వచ్చింది. దీంతో ఆ వన్యప్రాణి అక్కడే కూలిపోయింది. అనంతరం తీవ్ర అస్వస్థతతో ప్రాణాలు వదిలింది. శేషాచలం అడవుల నుంచి వచ్చి కరెంట్ షాక్ కు గురై ఏనుగు చనిపోయిందని అధికారులు నిర్ధారించారు.

PREV
click me!

Recommended Stories

Smart Kitchen Project for Schools | CM Appreciates Kadapa District Collector | Asianet News Telugu
Roop Kumar Yadav Serious Comments Anil Kumar Yadav | Nellore Political Heat | Asianet News Telugu