పులస ధర చూస్తే ఫ్యూజ్ లు అవుటే... ఎంత పలికిందంటే...

Published : Sep 06, 2023, 09:55 AM IST
పులస ధర చూస్తే ఫ్యూజ్ లు అవుటే... ఎంత పలికిందంటే...

సారాంశం

ఓ పులస చేపను వేలంలో ఓ మహిళ రూ.19వేలకు దక్కించుకుంది. ఆమె నుంచి మరో వ్యక్తి రూ.26వేలకు  కొనుగోలు చేశాడు. 

యానాం : సీజన్ వచ్చిందంటే చాలు పులసలకు ఉండే గిరాకీ మాటల్లో చెప్పలేనిది. జీవితంలో ఒక్కసారైనా పులసకూర తినాలని అంటారు.  పుస్తెలమ్మయిన పులస తినాల్సిందే.. అనే మాట కూడా ప్రచారంలో ఉంది. పులస చేపలకు ఉండే డిమాండ్ అలాంటిది. ఆ డిమాండ్ ను మరోసారి గుర్తు చేసింది మంగళవారం నాటి ఘటన.

యానాంలో మంగళవారం సాయంత్రం పుష్కర ఘాటు దగ్గరికి వనమాడి ఆదినారాయణ అనే మత్స్యకారుడు రెండు కిలోలకు పైగా బరువు ఉన్న పులస చేపను తీసుకువచ్చాడు. ఆ చేప అతని వలలో చిక్కింది. ఆ చేపను వేలం వేయగా..  కొల్లు నాగలక్ష్మి అనే మహిళ రూ.19వేలకు ఆ చేపను దక్కించుకున్నారు. 

ఆమె దగ్గర నుంచి ఈ పులస చేపను రూ.26వేలకు వేరే వ్యక్తి కొనుగోలు చేశాడు. రావులపాలెంకు చెందిన  ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కోసం ఆమె దగ్గర నుంచి చేపను కొనుగోలు చేసినట్లుగా సమాచారం.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం