ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో..

Published : Jun 24, 2022, 11:59 AM IST
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో..

సారాంశం

ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్నేహితులకు మెసేజ్ పంపి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆ విద్యార్థి.

ప్రకాశం : విద్యార్థుల ప్రగతిని అంచనా వేయాల్సిన పరీక్షలు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. చిన్నచిన్న కారణాలకే విద్యార్థులు suicideలు చేసుకుంటున్నారు. పరీక్షల్లో pass కాకపోతే జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్న వాళ్ళకు కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా andhrapradeshలో ఇటీవల ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడాన్ని జీర్ణించుకోలేని ఓ విద్యార్థి అశోక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం జరిగింది. 

ప్రకాశం జిల్లాలోని పుచ్చకాయల పల్లి గ్రామానికి చెందిన వజ్రాల అశోక్ రెడ్డి పట్టణంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఇటీవల విడుదలయిన ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్నేహితులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి సుంకేసుల గ్యాప్ వెలిగొండ ప్రాజెక్టు డ్యాం మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కుమారుడి మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. అశోక్ రెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కాగా,  ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో పరీక్షల్లో మొత్తం 2,41,591 (54శాతం) మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్ లో 2,58,449(61శాతం)  మంది పాసయ్యారు.  ఫస్ట్ ఇయర్ లో బాలుర ఉత్తీర్ణత శాతం 49% ఉండగా, బాలికలు 65 శాతం పాసయ్యారు. ఇక సెకండ్ ఇయర్ లో  బాలురు 54% , బాలికలు  68 శాతం ఉత్తీర్ణత సాధించారు. 
 

PREV
click me!

Recommended Stories

10వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami