కడపలో 13యేళ్ల బాలికపై క్రికెట్ కోచ్ లైంగిక వేధింపులు.. ఆలస్యంగా వెలుగులోకి...

By SumaBala BukkaFirst Published Jun 24, 2022, 10:07 AM IST
Highlights

కడపలో క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్న 13యేళ్ల బాలిక మీద కోచ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో ఒక కోచ్ ను సస్పెండ్ చేశారు. 
 

కడప : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో యూత్ క్రికెట్ క్లబ్ లో శిక్షణ పొందుతున్న 13 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు యూత్ క్రికెట్ క్లబ్, కడప క్రికెట్ అసోసియేషన్లు విచారణ జరిపి ఒక కోచ్ ను విధుల నుంచి సస్పెండ్ చేయడంతో పాటు మరో కోచ్ ను విధులకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై కడప క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, పొద్దుటూరు యూత్ క్లబ్ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని గురువారం ఒక మీడియా సంస్థ సంప్రదించగా... ఇద్దరు కోచ్ లలో ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయాన్ని ఆమె తల్లిదండ్రులు పది రోజుల క్రితం తమ దృష్టికి తీసుకు వచ్చారని, తరువాత తాము విచారణ  చేపట్టామని అన్నారు.

బాలిక ఫిర్యాదు చేసిన కోచ్ ను సస్పెండ్ చేశామని తెలిపారు. రెండో కోచ్ ను నెట్స్ కు రావద్దని చెప్పామని అన్నారు. కాగా, వేధింపుల ఘటన లో క్రికెట్ కోచ్ అహ్మద్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు  ప్రొద్దుటూరు మూడో ఠాణా ఎస్సై రాజగోపాల్ తెలిపారు. 13 ఏళ్ల బాలిక క్రికెట్ కోచ్ అహ్మాద్ వద్ద శిక్షణ తీసుకుంటోందని ఈ క్రమంలో అహ్మద్ తనను ప్రేమించాలంటూ బాలికను నెలరోజుల నుంచి వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందింది అన్నారు. 

ఏలూరులో ఘోరం... నడిరోడ్డుపైనే బైక్ తో సహా యువ సోదరుల సజీవదహనం

ఇదిలా ఉండగా, తెలంగాణ లోని హైదరాబాద్ లో ఇలాంటి దారుణ ఘటనే చోటు చేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. oldcityకి చెందిన 17 ఏళ్ల బాలిక నగరంలో ఉండే పెదనాన్న ఇంటికి తరచూ వెళుతూ ఉండేది. ఈ క్రమంలో ఆ బాలిక పెదనాన్న కుమారుడి కన్ను బాలిక మీద పడింది. చెల్లెలు అవుతుందని, చిన్నపిల్ల అని కూడా అతడికి గుర్తు రాలేదు. గత జనవరి నెలలో ఆ బాలికపై పెదనాన్న కుమారుడు (36) molestationకి పాల్పడ్డాడు. ఇది గమనించిన అతడి స్నేహితుడు కూడా ఆ minor girlను భయపెట్టి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా.. పలుమార్లు ఆ చిన్నారి మీద దారుణానికి ఒడిగట్టారు. 

ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి ఇద్దరూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇటీవల బాలిక ఆరోగ్యం కాస్త నలతగా ఉండటంతో… ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. ఆరు నెలల గర్భవతి అని తెలిసింది. దీంతో తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది.  పెదనాన్న కుమారుడు, అతని స్నేహితుడు పలుమార్లు  అత్యాచారం చేశారని తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. 

click me!