రోజా, పయ్యావుల కేశవ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ

By narsimha lodeFirst Published Jul 30, 2019, 2:13 PM IST
Highlights

అసెంబ్లీ లాబీల్లో వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ె ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మధ్య మంగఠవారం నాడు ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మధ్య  మంగళవారం నాడు ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది.  

మంగళవారం నాడు  అసెంబ్లీ లాబీల్లో  వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లు ఎదురుపడ్డారు. ఈ సమయంలో వీరిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకొన్నారు. 

రోజా ప్రసంగాల్లో మునుపటి ఫైర్ లేదని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్  అభిప్రాయపడ్డారు.  అయితే సభలో చంద్రబాబునాయుడు లేకపోవడం వల్లే తన ప్రసంగంలో వాడి తగ్గిందని రోజా అభిప్రాయపడ్డారు.

సభలో చంద్రబాబు ఉంటే ఆటోమెటిక్ గా తన స్పీచ్ ఫ్లో పెరుగుతుందని  రోజా పయ్యావులకు చెప్పారు. అదే సమయంలో  పయ్యావులపై రోజా సరదాగా కామెంట్స్ చేశారు. 

సభలో చంద్రబాబు లేని సమయం చూసి సీఎం జగన్ ను పయ్యావుల కేశవ్ పొగిడారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా  అన్నారు. తమ పార్టీ తీసుకురావాలనుకొన్న బిల్లును తెచ్చినందునే తాను ఆ రకంగా మాట్లాడానని పయ్యావుల కేశవ్ చెప్పారు. ఇదిలా ఉంటే రోజా మౌనం వెనుక మరేదైనా కారణం ఉండి ఉండొచ్చని పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు.


 

click me!