చిత్తూరు జిల్లాలోని పెనుమూరులో విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 17న కన్పించకుండా పోయిన ఇంటర్ విద్యార్ధిని మృతదేహం వ్యవసాయ బావిలో లభించింది.
తిరుపతి: చిత్తూరు జిల్లాలోని పెనుమూరులో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్ధిని భవ్యశ్రీ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. బావిలో ఆమె మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. భవ్యశ్రీ మృతదేహనికి అరగుండు చేయడంతో పాటు కనురెప్పలు కత్తిరించి ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు.
ఈ నెల 17వ తేదీన భవ్యశ్రీ కన్పించకుండా పోయింది. భవ్యశ్రీ ఆచూకీ కోసం కన్పించకుండా పోయిన విషయమై పేరేంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు సరిగా పట్టించుకోలేదని భవ్యశ్రీ పేరేంట్స్ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు కొట్టిపారేస్తున్నారు. భవ్యశ్రీ కన్పించకుండా పోయిన విషయమై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని చెప్పారు.
అంతేకాదు ఈ విషయమై గాలింపు చర్యలు చేపడితే వ్యవసాయ బావిలో భవ్యశ్రీ మృతదేహం లభ్యమైందన్నారు భవ్యశ్రీ మృతిపై మెడికల్, ఫోరెన్సిక్ రిపోర్టు కోసం చూస్తున్నామని పోలీసులు చెప్పారు. భవ్యశ్రీ ఆత్మహత్య చేసుకుందా.. ఎవరైనా ఆమెను హత్య చేశారా అనే విషయమై కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు. భవ్యశ్రీ స్నేహితులను కూడ పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికి ఎవరిని అదుపులోకి తీసుకోలేదని డీఎస్పీ చెప్పారు. ఇదిలా ఉంటే భవ్యశ్రీని హత్య చేసి వ్యవసాయ బావిలో పడేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భవ్యశ్రీని హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. భవ్యశ్రీది ఠాణావేణుగోపాలపురం గ్రామం. వినాయక విగ్రహాల నిమజ్జనం చేసే సమయంలో వ్యవసాయబావిలో భవ్యశ్రీ మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.