కడప ట్రిపుల్ ఐటీలో ఇంటర్ విద్యార్ధి ఈశ్వర్ సూసైడ్

Published : Nov 25, 2022, 09:39 AM IST
కడప ట్రిపుల్ ఐటీలో  ఇంటర్  విద్యార్ధి  ఈశ్వర్  సూసైడ్

సారాంశం

కడప  జిల్లా  ఇడుపులపాయలో  ట్రిపుల్  ఐటీ  కాలేజీలో  ఇంటర్  విద్యార్ధి  ఈశ్వర్  ఆత్మహత్య  చేసుకున్నాడు. గురువారంనాడు  మధ్యాహ్నం ఆత్మహత్య  చేసుకున్నాడు.

కడప: కడప  జిల్లాలోని  ఇడుపులపాయలో  ట్రిపుల్  ఐటీ కాలేజీలో  ఇంటర్  విద్యార్ధి  ఈశ్వర్   ఆత్మహత్య  చేసుకున్నాడు.  గురువారంనాడు  మధ్యాహ్నం  కాలేజీ   ఆవరణలోనే హస్టల్ లో  ఈశ్వర్  సూసైడ్  చేసుకున్నారు.ఈశ్వర్ రాసినట్టుగా  ఉన్న  సూసైడ్  లేఖను  పోలీసులు  స్వాధీనం  చేసుకున్నారు.అమ్మా, నాన్న  ఇప్పటికైనా  మాట్లాడుకోవాలని  ఈశ్వర్  సూసైడ్  లేఖలో  రాసి  ఉంది. తమ  మధ్య  ఎలాంటి  సమస్యలు  లేవని  ఈశ్వర్  తల్లి  చెప్పారు.  ఈశ్వర్  ఎందుకు  ఆత్మహత్య  చేసుకున్నాడో  తమకు అర్ధం  కావడం  లేదంటున్నారు.ఈ  ఘటనకు  సంబంధించి  ఈశ్వర్  తల్లిదండ్రులు  పోలీసులకు  పిర్యాదు  చేశారు.  ఈ  ఫిర్యాదు  ఆధారంగా పోలీసులు  కేసు నమోదు  చేసుకొని  దర్యాప్తు  చేస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అమరావతిలో జగన్నాథుని రథాన్ని లాగిన సీఎం చంద్రబాబు | Amaravati Jagannath Rath Yatra
జగన్నాథుని రథయాత్రలో CM చంద్రబాబు సూపర్ స్పీచ్ | CM Chandrababu Naidu Speech | Jagannath Rath Yatra