ఉగ్రరూపం దాల్చిన గోదావరి: వరదలపై వైఎస్ జగన్ ఆరా

Published : Aug 17, 2020, 12:24 PM ISTUpdated : Aug 17, 2020, 12:25 PM IST
ఉగ్రరూపం దాల్చిన గోదావరి: వరదలపై వైఎస్ జగన్ ఆరా

సారాంశం

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 58 అడుగులకు చేరుకుంది. వరదలపై సీఎం జగన్ ఆరా తీశారు.

అమరావతి: వరదలతో గోదారి నది ఉగ్రరూపం దల్చింది. భద్రాచలం వద్ద 58 అడుగులకు మించి నీటిమట్టం నమోదైంది. దేవీపట్నంలోని 36 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాల్లో వరదలు తీవ్ర ప్రభావం చూపించాయి. 

గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరుగుతూ వస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది.

దాంతో గోదావరి ఉధృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు ఆయన సమాచారం తెలుసుకుంటున్నారు. ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. 

కృష్ణా జిల్లాలో కరుస్తున్న భారీ వర్షాలపై, తర్వాతి పరిస్థితులపై కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.  

PREV
click me!

Recommended Stories

BR Naidu Press Meet: దేశం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్: బీఆర్ నాయుడు| Asianet Telugu
Swathi Deekshith & Pranavi Manukonda Visit Tirumala Temple: శ్రీవారిసేవలో ప్రముఖులు | Asianet Telugu