
హైదరాబాద్‌లోని కొన్ని కంపెనీల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మైనింగ్, ఫార్మా కంపెనీల్లో సోదాలు చేపట్టారు. ఒడిశాకు చెందిన రమేష్ ప్రసాద్ మైనింగ్ కార్యాలయంలో అధికారులు సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్‌లో రమేష్‌కు చెందిన నాలుగు కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. మరోవైపు సూరత్‌కు చెందిన సూరజ్ కంపెనీలో సోదాలు చేపట్టారు. సూరజ్ కంపెనీ హైదరాబాద్‌లో ఫార్మా బిజినెస్ చేస్తోంది. కాగా, ఐటీ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.