ఆ రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్.. కలెక్టర్ ఆదేశాలు.. వివరాలు ఇవే..

By telugu teamFirst Published Oct 17, 2021, 4:33 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, దాని సమీపంలో బార్లు, మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు ఈ నెల 18వ, 19వ తేదీన బంద్ చేయించాలని కలెక్టర్ ఎ సూర్యకుమారి ఆదేశాలు జారీ చేశారు. పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులను ఈ మేరకు ఆదేశించారు.
 

అమరావతి: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని జాగ్రత్తల నడుమ ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. అయితే, శాంతి భద్రతల నేపథ్యంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని, దీనికి సమీపంలోని మద్యం దుకాణాలు, బార్లు రెండు రోజులు bandh చేయాలని కలెక్టర్ ఎ సూర్యకుమారి ఆదేశించారు. ఈ నెల 18వ, 19వ తేదీలో ఈ ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలని అబ్కారీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Andhra Pradeshలో పైడి తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా ఈ నెల 18న తొలేల్ల ఉత్సవం, 19వ తేదీన సిరిమానోత్సవాలను నిర్వహిస్తారు. ఈ celebrations కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతలను కాపాడే ఉద్దేశంతో 18వ, 19వ తేదీల్లో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న, లేదా ఈ మున్సిపల్ కార్పొరేషన్ సమీపానికి గల liquor దుకాణాలు, వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు అన్నీ మూసేయించాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులను కలెక్టర్ ఎ సూర్యకుమారి ఆదేశించారు.

Also Read: దసరాకి మద్యం కిక్కు: తెలంగాణలో ఐదు రోజుల్లో రూ.685 కోట్ల మద్యం విక్రయాలు

కరోనా మహమ్మారి నేపథ్యంలో గతేడాది కూడా ఆంక్షల నడుమే ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఏడాది కూడా అదే తరహా నిర్వహించాలని అధికారులు నిర్వహించారు. ప్రజలు, భక్తులు కొవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకోవాలని, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని నగర డీఎస్పీ అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు జాతర కోసం పోటెత్తకుండా, తరలి రాకుండా ముందుగానే ప్రకటనలు చేయిస్తున్నట్టు వివరించారు. పైడి తల్లి అమ్మవారు, సిరిమాను సంబురాలను ప్రజలు కోరుకుంటున్నట్టుగా నిర్వహించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించడం గమనార్హం.

click me!