గంజాయి మత్తులో తల్లిపై దాడియత్నం.. కొట్టి చంపిన బంధువులు..

Published : Mar 24, 2021, 12:37 PM IST
గంజాయి మత్తులో తల్లిపై దాడియత్నం.. కొట్టి చంపిన బంధువులు..

సారాంశం

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో దారుణం జరిగింది. ఓ కొడుకును తల్లి తరఫు బంధువులు దారుణంగా కొట్టి చంపారు. గంజాయి మత్తులో తల్లిపై దాడికి ప్రయత్నించడంతో బంధువులు ఈ పనికి తెగబడ్డారు. 

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో దారుణం జరిగింది. ఓ కొడుకును తల్లి తరఫు బంధువులు దారుణంగా కొట్టి చంపారు. గంజాయి మత్తులో తల్లిపై దాడికి ప్రయత్నించడంతో బంధువులు ఈ పనికి తెగబడ్డారు. 

మృతుడు భార్గవ గత కొంత కాలంగా గంజాయికి బానిసయ్యాడు. మత్తులోనే తూలుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం గంజాయి మత్తులో తల్లిని డబ్బులు అడిగాడు. తల్లి ఇవ్వకపోవడంతో దాడికి ప్రయత్నించాడు. 

ఈ విషయాన్ని తల్లి తన అన్నతమ్ముళ్లకు చెప్పడంతో భార్గవపై తల్లి తరఫు బంధువుల దాడి చేశారు. తీవ్రంగ గాయపడిన భార్గవ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ఘటన మీద ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదంటూ పోలీసుల పట్టించుకోవడం లేదు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu