సీఎం జగన్ తో తూర్పు నావికాదళం ప్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్ భేటీ

By Arun Kumar PFirst Published Mar 24, 2021, 12:05 PM IST
Highlights

తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్మోహన్ రెడ్డిని  తూర్పు నావికా దళం ప్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్, వైస్‌ ఆడ్మిరల్‌ అజేంద్ర బహుదుర్‌ సింగ్‌ భేటీ అయ్యారు.   

అమరావతి: సీఎం వైయస్‌.జగన్మోహన్ రెడ్డిని విశాఖపట్నం తూర్పు నావికాదళం ప్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్, వైస్‌ ఆడ్మిరల్ అజేంద్ర బహుదుర్‌ సింగ్‌ కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో వీరిద్దరు భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందేనని సీఎం కార్యాలయ అధికారులు తెలిపారు. 

అలాగే అమరావతిలోని సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ ను కూడా అజేంద్ర బహుదూర్‌ సింగ్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన ఇటీవల వైస్ అడ్మిరల్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇలా సీఎం, సిఎస్ ను కలిశారు. ఈసందర్భంగా వీరు వివిధ అంశాలపై చర్చించారు.

సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ వైస్ అడ్మిరల్ బహదూర్ సింగ్ కు పూలగుచ్చం అందించి దుశ్శాలువ, బొబ్బిలి వీణ, జ్ణాపికతో సత్కరించారు. అలాగే బహదూర్ సింగ్ కూడా తూర్పు నావికాదళం తరుపున సబ్మెరైన్ జ్ణాపికను సిఎస్ కు అందించారు.
 

click me!