వివాహేతర సంబంధం : భార్య, ఆమె ప్రియుడిని కత్తితో పొడిచి, బండరాళ్లతో మోది...

Published : Jun 19, 2021, 11:01 AM IST
వివాహేతర సంబంధం : భార్య, ఆమె ప్రియుడిని కత్తితో పొడిచి, బండరాళ్లతో మోది...

సారాంశం

వివాహేతర సంబంధాలు ఇటీవలి కాలంలో దారుణహింసకు దారి తీస్తున్నాయి. ఇలాంటి ఘటనే కర్నూల్ లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, ఆమె ప్రియుడి మీద కత్తి, బండరాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య ప్రియుడు మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. 

ఈ ఘటన గొనెగండ్ల మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగరాజు అనే వ్యక్తి భార్య ఉరుకుందమ్మ గత కొన్నాళ్లుగా బజారీ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అగ్నిసాక్షిగా తాళి కట్టిన తనను కాదని వేరేవ్యక్తితో తన కళ్లముందే కాపురం చేయడాన్ని నాగరాజు భరించలేకపోయాడు. 

దీంతో ఉరుకుందమ్మ, ఆమె సహజీవనం చేస్తున్న వ్యక్తి మీద పగ పెంచుకున్నాడు. అదును చూసి వారిద్దరి మీద కత్తి, బండరాళ్లో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బజారీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఉరుకుందమ్మ పరిస్థితి విషమంగా ఉంది. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu