తెలంగాణ టు ఏపీ: వాటర్ ట్యాంకర్ లో మద్యం అక్రమ రవాణా (వీడియో)

By telugu teamFirst Published Sep 5, 2020, 11:11 AM IST
Highlights

వాటర్ ట్యాంకర్ లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

విజయవాడ: తెలంగాణ నుంచి వాటర్ ట్యాంకర్ లో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. దాదాపు రెండు వందల మద్యం కేసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా తలనొప్పిగా మారింది..

 పేదల జీవితాలు మెరుగుపడటానికి మద్యపానం తగ్గించాలనే ప్రభుత్వ సంకల్పానికి తూట్లు పొడుస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉండటంతో అక్రమార్కులు వివిధ రకాల మార్గం  ద్వారా మద్యాన్ని తరలిస్తున్నారు. వారు అనుసరించే   విధానాలు చూసి పోలీసులు కూడా అవాక్కవుతున్నారు. 

కొంతమంది వాటర్ ట్యాంకులు,  మరికొంతమంది నడుముకు బెల్టు కట్టుకొని మద్యం బాటిళ్లను అక్రమంగా చేరవేస్తున్నారుఇటీవల కృష్ణా జిల్లాలో అక్రమ మద్యం బాటిళ్లను  పోలీసు దగ్గరుండి మరీ  రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు

"

click me!