తాడిపత్రిలో రెచ్చిపోయిన మట్కా మాఫియా... పోలీస్ వాహనానికి నిప్పు

sivanagaprasad kodati |  
Published : Dec 30, 2018, 05:53 PM IST
తాడిపత్రిలో రెచ్చిపోయిన మట్కా మాఫియా... పోలీస్ వాహనానికి నిప్పు

సారాంశం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మట్కా నిర్వాహకులు రెచ్చిపోయారు. రైడ్ చేసేందుకు వచ్చిన పోలీస్ వాహనానికి నిప్పు పెట్టారు. పట్టణంలోని ఓ ప్రాంతంలో అక్రమంగా మట్కా సెంటర్ నడుపుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు రైడ్ చేసేందుకు వెళ్లారు.

పోలీసుల రాకను గమనించిన మట్కా నిర్వాహకులు వారిని అడ్డుకున్నారు. పోలీస్ సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పాటు పోలీస్ వాహనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కడపకు చెందిన సీఐ, కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అదనపు బలగాలతో ఘటనాస్థలికి బయలుదేరారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 
 
PREV
click me!

Recommended Stories

పాయకరావుపేట పాపమ్మ ట్రాక్ రికార్డ్ చూసుకో: YSRCP leader Shyamala on Home minister Anitha Vangalapudi
IMD Rain Alert : రుతుపవనాలు అలర్ట్, ద్రోణి ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ఇక వర్షబీభత్సమే